తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ కి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు బిగ్ బాస్ ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. త్వరలో బిగ్ బాస్ సీజన్ 7 రాబోతుంది.. దీనికి సంబంధించిన లోగో కు సంబంధించిన ప్రోమో ఈ మద్యనే రిలీజ్ చేశారు.
తెలుగు బుల్లితెరపై ఇప్పటి వరకు ఎన్నో రియాల్టీ షోలు వచ్చినా.. బిగ్ బాస్ బిగ్ బాస్ రియాలిటీ షోకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన బిగ్ బాస్ ప్రస్తుతం వివిధ భాషల్లో వస్తుంది. తెలుగులో బిగ్ బాస్ సీజన్ 1 కి ఎన్టీఆర్ హూస్ట్ చేయగా.. తర్వాత నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ప్రస్తుతం కింగ్ నాగార్జున హూస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు సీజన్లు పూర్తి కాగా.. బిగ్ బాస్ 7 వ సీజన్ సిద్దంగా ఉంది. తాజాగా బిగ్ బాస్ సీజన్ 7 కి సంబంధించిన నాగార్జున ప్రోమో రిలీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ లో పాపులర్ రియాల్టీ షో బిగ్ బాస్ కి సల్మాన్ ఖాన్ హూస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అక్కడ ఈ షోగా బాగా సక్సెస్ కావడంతో ఇతర భాషల్లో బిగ్ బాస్ ని పరిచయం చేశారు. తెలుగు లో ఇప్పటి వరకు బిగ్ బాస్ 6 సీజన్లు పూర్తి చేసుకుంది. త్వరలో బిగ్ బాస్ 7 వ సీజన్ కి సిద్దం అవుతుంది. ఇటీవల బిగ్ బాస్ 7 కి సంబంధించిన లోగో ప్రోమో రిలీజ్ చేశారు. ఇటీవల బిగ్ బాస్ 7 కి కొత్త హూస్ట్ వస్తున్నారని రక రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. వాటన్నింటికి పులిస్టాప్ పెడుతూ.. తాజాగా కింగ్ నాగార్జునకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో లో నాగార్జున అల్ట్రా స్టైలిష్ లుక్ లో నాగ్ అదరగొట్టేశాడు.
లేటెస్ట్ గా రిలీజ్ అయిన బిగ్ బాస్ 7 ప్రోమోలో నాగార్జున చేతిలో ఓ పాప్ కార్న్ డబ్బా పట్టుకొని అటూ ఇటూ తిరుగుతూ.. ‘ఈసారి సీజన్ గురించి ఏం చెప్పాలి.. చాలా కొత్తగా చెప్పాలి కదా.. హా.. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్’ అంటూ చిటిక వేయగానే.. అక్కడ ఉన్న వస్తువులన్నీ గాల్లో ఎగిరిపోతున్నాయి. మొత్తానికి ప్రోమో చూస్తుంటే ఈ సీజన్ లో మేకర్స్ చాలా కొత్తగా వెరైటీగా ప్లాన్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7 కింగ్ నాగార్జునకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఈసారి ఇచ్చే కంటెస్టెంట్స్ తో నాగ్ ఎలా ఆడుకుంటాడో చూడాలి.