బుల్లితెరపై తనదైన కామెడీతో కడుపుబ్బా నవ్వించిన రైడీ రోహిణి గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. జబర్ధస్త్ కామెడీ షోలో తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను మెప్పిస్తుంది.. వెండితెరపై కూడా తన సత్తా చాటుతుంది.
తెలుగు బుల్లితెరపై జబర్ధస్త్ కామెడీ షోతో ఎంతో మంది తమదైన కామెడీతో ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. పలు టీవీ సీరిలయ్స్ లో నటించిన రోహిణి జబర్ధస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి కామెడీ టైమింగ్ తో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. రోహిణి నటన, మాట్లాడే విధానం చాలా ఫన్నీగా ఉంటుంది. జబర్ధస్త్ లో మొదటి లేడీ టీమ్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఓ వైపు బుల్లితెరపై నటిస్తూనే వెండితెరపై పలు చిత్రాల్లో నటిస్తూ వస్తుంది. ప్రస్తుతం రోహిణి కాలుకు శస్త్ర చికిత్స చేశారు. వివరాల్లోకి వెళితే..
జబర్ధస్త్ కామెడీ షో తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది రౌడీ రోహిణి. మొదటి లేడీ టీమ్ లీడర్ గా సత్తా చాటింది. బుల్లితెరపై నటిస్తూనే పలు సినిమాలు, వెబ్ సీరీస్ లతో బిజీగా ఉంటుంది. విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చేరి రోహిని తన కాలు సర్జరీ చేయించుకుంది. సర్జరీ చేయడానికి డాక్టర్లు పది గంటల పాటు శ్రమించి ఆమె కాలులో ఉన్న రాడ్ ను తొలగించారని తెలిపారు. ఐదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో కాలికి రాడ్ వేశారని.. ఇప్పుడు దాన్ని తీసివేశారని తెలిపింది. ప్రస్తుతం తన పరిస్థితి బాగానే ఉందని.. దేవుడి దయవల్ల అంతా బాగానే జరిగిందని ఈ మేరకు తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా తెలిపారు.
రోహిణి మాట్లాడుతూ.. ‘ఐదు సంవత్సరాల క్రితం ప్రమాదంలో నా కాలులో రాడ్ వేశారు. ఆ రాడ్ తొలగించుకోవడానికి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి జాయిన్ అయ్యాను. అయితే రాడ్ స్కిన్ కి బాగా అటాచ్ అయ్యిందని.. తీయడానికి వీలు పడదని డాక్టర్లు తెలిపారు. దీంతో నాకు యాక్సిడెంట్ అయినపుడు చికిత్స చేసిన డాక్టర్ ని సంప్రదించాను. ఈ క్రమంలోనే నేను సర్జరీ కోసం విజయవాడకు వచ్చాను. సర్జరీ కోసం పదిగంటల పాటు వైద్యులు ఎంతో శ్రమించారు. మొత్తానికి కాలులో ఉన్న రాడ్ ని తొలగించారు. ఆరు వారాల పాటు నన్ను రెస్ట్ తీసుకోవాలని.. కాలుపై ఎలాంటి బరువు పెట్టవొద్దని సూచించారు. ఆరోగ్యం పూర్తిగా నయం అయిన తర్వాత సెట్ లోకి అడుగుపెడతా’ అని తెలిపింది.