జబర్థస్త్, ఎక్స్ ట్రా జబర్థస్త్ తెలుగు బుల్లితెర కామెడీ షోల్లో టాప్ స్థానంలో ఉంటుంది. ఈ షో ద్వారా అనేక మంది నటులు తమను తాము నిరూపించుకున్నారు. ఈ షో ద్వారానే అనేక మంది వెండి తెరపై మెరుస్తున్నారు. అటువంటి వారిలో రాకింగ్ రాకేష్ ఒకరు. ఇటీవల ఒకింటి వాడైన రాకేష్.. భార్య, కో నటి సుజాతపై కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
తెలుగు తెరపై కడుపుబ్బా నవ్వించే కామెడీ షో అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేదీ జబర్థస్త్, ఎక్స్ ట్రా జబర్థస్త్. గురు, శుక్రవారాల్లో ప్రసారమయ్యే ఈ షోలకు ఫ్యాన్స్‌తో పాటు మంచి రేటింగ్ కూడా ఉంది. ఎన్నో ఏళ్ల నుండి ప్రసారమౌతున్నా ఎక్కడా బోర్ అనిపించదు. అందులో టీమ్ లీడర్స్, మిగతా సభ్యులు చేసే స్కిట్లు, ఫన్నీ డైలాగ్స్, కౌంటర్స్ చూస్తూ అక్కడి జడ్జిలే కాదూ.. ఇంటిల్లిపాదీ హాయిగా నవ్వుకుంటారు. వీటిని టీవీల్లో మిస్ అయిన వాళ్లు సైతం.. తీరిక సమయాల్లో యూట్యూబ్‌లో చూస్తారు. ఈ షోల ద్వారా అనేక మంది బుల్లితెరపై తమ టాలెండ్‌ను రుజువు చేసుకున్నారు. వీటి ద్వారా వెండితెరపైనా అవకాశాలు పొందుతున్నారు. అటువంటి వారిలో ఒకరు రాకింగ్ రాకేష్. ఎక్స్ ట్రా జబర్థస్త్ లో టీమ్ లీడర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటివాడైన రాకేష్.. నెల తిరగకుండానే భార్యా బాధితుడైనట్లు కనిపిస్తోంది.
న్యూస్ ప్రజెంటర్, జోర్దార్ సుజాతను రాకేష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. జబర్థస్త్ కు వచ్చిన కొత్తలో చిన్న పిల్లలతో స్కిట్లు చేసిన రాకేష్.. ఆ తర్వాత పెద్ద వాళ్లతో చేయడం ప్రారంభించారు. అటు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వచ్చిన తర్వాత రాకేష్ తో కలిసి పలు స్కిట్లు చేసింది సుజాత. వీరి జంట తెరపై చూడ ముచ్చటగా ఉంటుంది. ఆ సమయంలో ఏర్పడ్డ స్నేహం, ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. గత నెలలో తిరుపతిలో వీరి వివాహం జరగ్గా.. పలువురు నటులతో పాటు వైసీపీ నేత, మంత్రి రోజా సైతం పాల్గొని దంపతులను ఆశ్వీరదించారు. అయితే ఓ స్కిట్ లో భాగంగా సుజాతపై రాకింగ్ రాకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమెను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకున్నావా అనగా.. మాదొక పవిత్రమైన ప్రేమ అంటూనే.. యూటర్న్ తీసుకున్నారు. ‘బొంగులో లవ్ అండీ.. బొంగులో లవ్.. ప్రేమించేదాక.. పెళ్లి చేసుకునేదాక టార్చర్ పెట్టిదంటూ’ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై అభిమానులు మండిపడుతున్నారు. వీరికి ఏమైందీ అంటూ ప్రశ్నిస్తున్నారు.
జబర్థస్త్ స్కిట్స్‌లో వల్గారిటీ పక్కన పెడితే.. రాకేష్-సుజాతలకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బుల్లితెరపై వీరి జంటను చూసిన వాళ్లంతా.. రియల్ లైఫ్ జోడి అయితే చూడాలనుకున్నారు. ఫ్యాన్స్ కోరుకున్నట్లే వీరి స్నేహం, ప్రేమగా చిగురించి, పెళ్లి బంధంతో ఏకమైంది. వీరి పెళ్లి చేసుకుంటున్నారన్న వార్త అభిమానుల్లో ఆనందం నింపింది. అయితే పెళ్లి అంటే పదికాలాల పాటు నిలిచే బంధం. ఈ బంధం ధృడంగా ఉండాలని కొత్త జంట కోరుకుంటారు. అయితే ఇప్పుడు ఆమెను ఉద్దేశించి రాకేష్ ఈ వ్యాఖ్యలు చేయడంపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. స్కిట్ అయినా సరే.. ఇటువంటి వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు. పెళ్లి అయి కేవలం నెల రోజులు దాటిందని, శుభం పలకాల్సిన సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని సూచిస్తున్నారు. పెళ్లి బంధం బలంగా పాతుకుపోయే సమయంలో అమంగళం మాట్లాడుతూ.. ఆమెను నొప్పించవద్దని, బుల్లితెరపైనా ఇటువంటి స్కిట్లు చేయవద్దని చెబుతున్నారు. ఇంకా పెళ్లి తాలూకా ఆనందాలను, అనుభూతిని మర్చిపోకముందే.. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని, మీ జంటే తమకు ఎంతో్ ఇష్టమని, స్కిట్ల కోసం కూడా మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేయోద్దని సూచిస్తున్నారు.