పాకీజా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అయితే ఆమె గత కొంతకాలంగా అవకశాలు లేక.. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో పాకీజా పరిస్థితి గురించి సుమన్ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆ ప్రయత్నం ఫలించి.. ఆమెకు అవకాశాలు అందుతున్నాయి. తాజాగా ఓ షోలో సందడి చేశారు పాకీజా. ఆ వివరాలు..
నటి పాకీజా గురించి 90నాటి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పేరునే బ్రాండ్‌గా మార్చుకున్నారు పాకీజా. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. మరీ ముఖ్యంగా అసెంబ్లీ రౌడీ చిత్రంలో బ్రహ్మానందం-పాకీజాల మధ్య వచ్చిన కామెడీ సీన్లను ఎవరు మర్చిపోలేరు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా వందల సినిమాలు చేసి.. తెలుగులో కూడా 50కి పైగా సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది పాకీజా. అయితే ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి అదృష్టం ఎలా మారుతుందో అర్ధం కాదు. ఒకప్పుడు తారా పథంలోకి దూసుకుపోయి.. స్టార్‌లుగా నిలిచిన వారు.. ఆ తర్వాత అదృష్టం కలిసిరాక.. అత్యంత దుర్భర పరిస్థితులను చూసిన వారు ఎందరో ఉన్నారు. పాకీజా కూడా ఆ కోవలోకి వస్తారు. ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేతి నిండా సినిమాలతో కెరీర్‌లో బిజీగా గడిపిన పాకీజా ఆ తర్వాత.. అవకాశాలు లేక.. కనీసం తినడానికి తిండి కూడా లేక అత్యంత దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్నారు.
ఈక్రమంలో సుమన్ టీవీ.. పాకీజాను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. ఆమె ప్రస్తుత పరిస్థితి గురించి, ఆమె ఆర్థిక ఇబ్బందుల గురించి తెలియజేసింది. ఇండస్ట్రీకి చెందిన వారు తనను ఆదుకోవాలని కోరింది. దీంతో రీసెంట్‌గా సుమన్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న పాకీజా.. తనను ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ఆర్థికంగా ఆదుకోవాలని, అవకాశాలు ఇప్పించాలని. ఈ వీడియో వైరల్ కావడంతో.. పాకీజా దీనస్థితి గురించి తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి, మెగా బ్రదర్ నాగబాబు ఆమెకు ఆర్థికంగా సహాయం అందించి ఆదుకున్నారు. అంతేకాక ప్రస్తుతం ఆమెకు అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇక తాజాగా ఆమె ఓ షోలో రీ ఎంట్రీ ఇచ్చి.. అందరిని ఆకట్టుకున్నారు.
జబర్దస్త్ షో గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అప్‌కమింగ్ కమెడియన్లు తమ టాలెంట్ నిరూపించుకోవడానికి అద్భుతమైన వేదికగా మారింది. ఈ షోలో కనిపించిన కమెడియన్లు ఎందరో.. ప్రస్తుతం సినిమాల్లో మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. ఇక జబర్దస్త్ ద్వారా బాగా పాపులర్ అయిన వేణు తాజాగా.. బలగం సినిమా ద్వారా దర్శకుడిగా మారాడు. అయితే ఈ షోలో కొత్త కమెడియన్లే కాకుండా అప్పుడప్పుడు తెరమరుగై పోయిన సీనియర్ నటులు కూడా కనిపిస్తున్నారు. తాజాగా నటి పాకీజా ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో తళుక్కున మెరిశారు. ఈ మధ్యే తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు పాకీజా చెప్పినప్పుడు.. సుమన్ టీవీ చొరవతో మెగా ఫ్యామిలీ ఆమెను ఆదుకుంది. తాజాగా ఆమె బుల్లితెరపై కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. ప్రస్తుతం ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రొమో వైరలవుతోంది. ఆ వివరాలు..
ఈవారం ‘సెలబ్రెటీ స్పెషల్’ థీమ్‌తో ఎపిసోడ్ చేశారు. దీనికి ‘దాస్ కా ధమ్కీ’ హీరో విశ్వక్ సేన్, రైటర్ ప్రసన్న అతిథులుగా వచ్చారు. ప్రోమో స్టార్టింగ్‌లో కెవ్వు కార్తిక్ పెర్ఫామెన్స్ చూపించారు. ఈ స్కిట్‌లో జబర్దస్త్ యాంకర్ సౌమ్య గెస్ట్‌గా వచ్చింది. కాసేపటికి.. గొడుగు, కళ్లజోడు వేసుకొని అలనాటి కమెడియన్ పాకీజా ఎంట్రీ ఇచ్చారు. వస్తూ వస్తూనే పాకీజాకి డ్యాష్ ఇచ్చాడు రైజింగ్ రాజు. అతడు పడిపోతుండగా.. పాకీజా రాజును పట్టుకొని ‘‘బరువున్నానా..’’ అంటే.. ‘‘డాక్టర్ వేసిన స్టంట్ కంటే పెద్ద బరువు అనిపించలేదు’’ అనేసరికి అంతా నవ్వుతారు. తర్వాత విశ్వక్ సేన్ కూడా ఓ చిన్న స్కిట్ చేశాడు. ఇలా మొత్తానికి పాకీజా ఎంట్రీపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను ఈ షోలో కొనసాగించి, ఆదుకోవాలని కోరుతున్నారు. మరి పాకీజా ఈ ఎంట్రీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.