పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలియని వారు ఉండరు. నటుడిగానే కాకుండా రాజకీయ నేతగా తనదైన ముద్ర వేసుకున్నారు. సోదరుడు చిరంజీవి నుండి నట వారసుడిగా వచ్చిన ఆయన.. తనదంటూ అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ఆయన సినీ ప్రస్థానం నేటితో 27 ఏళ్లు పూర్తి చేసుకుంది. అదేవిధంగా ఈ నెల 14 నాటికి జనసేన పార్టీ ఏర్పాటు చేసి 9 ఏళ్లు పూర్తి కావొస్తుంది. ఈ సందర్భంగా పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ పేరు తెలియని సినిమా ఇండస్ట్రీ లేదంటే అతిశయోక్తి కాదు. చిరంజీవి తమ్ముడిగా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. తనకంటూ మార్క్‌ను సెట్ చేసుకున్నారు. ఏ హీరోకు లేని ఫ్యానీజం ఆయనకు సొంతం. హీరోగానే కాకుండా రాజకీయాల్లోకి ప్రవేశించి గొప్ప నేతగా, అంతకంటే మంచి వ్యక్తిత్వమున్న మనిషిగా రుజువు చేసుకున్నారు. ఆయన సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టి నేటితో 27 సంవత్సరాలు పూర్తి కావస్తున్నాయి. అదేవిధంగా జనసేన పార్టీ ఆవిర్భావం జరిగి ఈ నెల 14 నాటికి 9ఏళ్లు పూర్తి కానున్నాయి. జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని మచిలీ పట్నంలో జరపనున్నారు. దిగ్విజయ భేరీ పేరుతో జరగనున్న సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ రెండు సందర్భాలను పురస్కరించుకుని పలువురు నిర్మాతలు, దర్శకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. వీరిలో ఆయన అభిమాన నిర్మాత ఏ.ఎం. రత్నం కూడా ఉన్నారు. ‘మనసేమో ప్రజల మీద. తనువేమో వెండి తెర మీద. రెండింటిలోనూ ప్రజల మనసు చూరగొన్న పవన్ కళ్యాణ్ 27 సంవత్సరాల సినీ జీవితాన్ని..తొమ్మిది సంవత్సరాల రాజకీయ రంగ ప్రవేశాన్ని పూర్తిచేసుకున్న సందర్భంగా వారికి నా శుభాకాంక్షలు. వారు ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను’ అని వ్యాఖ్యానించారు. ఈ వీడియోను జనసేన ట్విట్టర్ లో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్‌గా మారుతున్నాయి. పవన్ కళ్యాణ్, క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘హరి హర వీరమల్లు’. ఈ సినిమాకు ఏ.ఎం. రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గతంలో పవన్‌తో ఖుషీ, బంగారం వంటి సినిమాలు ఆయన నిర్మించారు. ముచ్చటగా మూడవ సారి వీరిద్దరూ కాంబోలో సినిమా తెరకెక్కబోతోంది.
‘27 ఏళ్ల పవనిజం, పవన్ కళ్యాణ్. ఇది పేరు మాత్రమే కాదు. హోప్ ఫర్ ద మిలియన్స్. వపన్ కళ్యాణ్ నా జస్ట్ ఎ ఫిల్మ్ స్టార్. ఓ గ్రేట్, రియల్ లీడర్. వాయిస్ ఫర్ ద పీపుల్. ఫైట్ ఫర్ పీపుల్, ఏపీ తదుపరి సీ.ఎం ఆయనే’ అంటూ దర్శకుడు, నటుడు ఎస్.జె. సూర్య శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా డైరెక్టర్ రాఘవేంద్రరావు, మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల, కళా దర్శకుడు ఆనంద్ సాయి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. తనకు పవన్ చిన్నప్పటి నుండి తెలుసుని, ఎప్పుడూ ఏదో దీక్షతో పనిచేస్తాడని డైరెక్టర్ రాఘవేంద్రరావు పొగిడారు. అదే దీక్షతో, పట్టుదలతో హీరోగా 27 ఏళ్లు దిగ్విజయంగా పూర్తి చేసినందుకు అభినందనలు తెలిపారు. నటనతో కోట్లాది మంది ప్రజలను మెప్పించి.. ఇప్పుడు అదే ప్రజలకు ఏదో సేవ చేయాలని తపనతో జనసేన అనే పార్టీని ఏర్పాటు చేశాడని పేర్కొంటూ ఆల్ ది బెస్ట్ చెప్పారు.
దిగ్విజయభేరి !
శ్రీ పవన్ కళ్యాణ్ గారి 27 ఏళ్ల సినీ ప్రస్థానం, జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవం గురించి అగ్ర నిర్మాత శ్రీ ఎ.ఎం. రత్నం గారు
Producer AM Ratnam garu about 27 years of Sri @PawanKalyan garu’s film career & JanaSena’s 10th formation day. #27YearsOfPawanKalyan pic.twitter.com/eJl8e11F0u
— JanaSena Party (@JanaSenaParty) March 10, 2023
దిగ్విజయభేరి !
శ్రీ పవన్ కళ్యాణ్ గారి 27 ఏళ్ల సినీ ప్రస్థానం, జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవం గురించి ప్రముఖ దర్శకులు శ్రీ రాఘవేంద్ర రావు గారు
Director Sri @Ragavendraraoba garu abt 27 years of @PawanKalyan garu’s film career & JanaSena’s 10th formation day#27YearsOfPawanKalyan pic.twitter.com/VFsdgeqzLY
— JanaSena Party (@JanaSenaParty) March 11, 2023