ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు తీరుపై మండిపడుతున్నారు జన సేన నేతలు కార్యకర్తలు. ఇటీవల శ్రీకాళ హస్తిలో ఆందోళన చేపట్టారు జనసేన కార్యకర్తలు. అయితే ఆ నిరసనను ఆపేందుకు రంగంలోకి దిగిన వన్ టౌన్ సీఐ అంజూ యాదవ్ ఓ కార్యకర్తపై చేయి చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల ఫలితాలు ఊహించని రీతిలో వచ్చాయి. ప్రతిపక్ష టీడీపీ ఏకంగా మూడుకు మూడు స్థానాలు గెల్చుకుంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ను లక్ష్యంగా చేసుకుని మెగా బ్రదర్ నాగబాబు ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ బాగా వైరల్ అవుతోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలియని వారు ఉండరు. నటుడిగానే కాకుండా రాజకీయ నేతగా తనదైన ముద్ర వేసుకున్నారు. సోదరుడు చిరంజీవి నుండి నట వారసుడిగా వచ్చిన ఆయన.. తనదంటూ అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ఆయన సినీ ప్రస్థానం నేటితో 27 ఏళ్లు పూర్తి చేసుకుంది. అదేవిధంగా ఈ నెల 14 నాటికి జనసేన పార్టీ ఏర్పాటు చేసి 9 ఏళ్లు పూర్తి కావొస్తుంది. ఈ సందర్భంగా పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు.
గత కొంత కాలంగా ఏపిలో రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. అధికార పక్షం వైసీపీ వర్సెస్ జనసేన మద్య మాటల యుద్దం నడుస్తుంది. పవన్ కళ్యాన్ పై వైసీపీ నేతలు వరుస పెట్టి మాటల యుద్దానికి దిగుతున్నారు. ఆ మద్య ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జనసేన అధినేత పవన్ కల్యాన్ పై దత్తపుత్రుడు అంటూ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా చంద్రబాబు దత్తపుత్రుడు అంటూ తనపై వైసీపీ నేతలు పదే పదే చేస్తున్న విమర్శలపై […]