గత కొంత కాలంగా ఏపిలో రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. అధికార పక్షం వైసీపీ వర్సెస్ జనసేన మద్య మాటల యుద్దం నడుస్తుంది. పవన్ కళ్యాన్ పై వైసీపీ నేతలు వరుస పెట్టి మాటల యుద్దానికి దిగుతున్నారు. ఆ మద్య ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జనసేన అధినేత పవన్ కల్యాన్ పై దత్తపుత్రుడు అంటూ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా చంద్రబాబు దత్తపుత్రుడు అంటూ తనపై వైసీపీ నేతలు పదే పదే చేస్తున్న విమర్శలపై పవన్ కళ్యాణ్ ఘాటుగా బదులిచ్చారు.
పవన్ కళ్యాణ్ అనంతపురం రూరల్ మండలం పూలకుంట, మన్నీల గ్రామాలు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వ పాలసీల గురించి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేసే తప్పుల గురించి నిలదీస్తున్నపుడు నన్ను సీబీఎన్ కి దత్తపుత్రుడు అని మాట్లాడితే.. నేను సీఎం జగన్ ని సీబీఐ కి దత్తుపుత్రుడు అని అనాల్సి వస్తుందని వైసీపీ అగ్రనేతలకు, నాయకులకు హెచ్చిరించారు. అలాగే జనసేన నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు ప్రతి ఒక్కరికీ చెప్పేది ఒక్కటే మరోసాని వైసీపీ నేతలు నన్ను సీబీఎన్ కి దత్తపుత్రుడు అని మాట్లాడితే జగన్ సీబీఐ కి దత్తపుత్రుడు అని నిర్మోహమాటంగా అనండి అని చెప్పారు.
సీబీఐ దత్త పుత్రుడు @Ysjagan Reddy అని అనాల్సి వస్తుంది ~ @PawanKalyan 😂#CBIDattaPuthrudu#JanaSenaRythuBharosaYatra pic.twitter.com/onuc7k2PZ5
— ★彡 𝙽𝚊𝚟𝚎𝚎𝚗 𝙹𝚂𝙿 🦅彡★ (@_jspnaveen) April 12, 2022