ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు తీరుపై మండిపడుతున్నారు జన సేన నేతలు కార్యకర్తలు. ఇటీవల శ్రీకాళ హస్తిలో ఆందోళన చేపట్టారు జనసేన కార్యకర్తలు. అయితే ఆ నిరసనను ఆపేందుకు రంగంలోకి దిగిన వన్ టౌన్ సీఐ అంజూ యాదవ్ ఓ కార్యకర్తపై చేయి చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు తీరుపై మండిపడుతున్నారు జన సేన నేతలు కార్యకర్తలు. శ్రీకాళహస్తిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్న జనసేన కార్యకర్తలను అడ్డుకున్నారు పోలీసులు. అయితే ఆ నిరసనను ఆపేందుకు రంగంలోకి దిగిన వన్ టౌన్ సీఐ అంజూ యాదవ్ ఓ కార్యకర్తపై చేయి చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వార్తా స్రవంతిలో చక్కర్లు కొడుతోంది. కాగా, అంజూ యాదవ్ పై ఇలాంటి విమర్శలు రావడం కొత్తేమీ కాదూ.. గతంలోనూ నిరసన చేస్తున్న మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించింది. గత ఏడాది ఓ మహిళా వ్యాపారిని కొట్టి, బలవంతంగా జీపు ఎక్కించడం అప్పట్లో పెనుదుమారం రేగింది. ఆ సమయంలో ఆమెపై మహిళా కమిషన్ సీరియస్ కూడా అయ్యింది. అయినా ఆమె తీరులో మార్పు రాలేదు.
తాజాగా మరోసారి ఆమె చేతలు వివాదమవుతున్నాయి. జనసేన కార్యకర్తలపై సీఐ అంజూ యాదవ్ దాడి చేసింది. తిరుపతి జిల్లాలోని శ్రీకాళ హస్తిలోని పెళ్లి మండపం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసేన కార్యకర్తలు నిరసనలు చేపడుతుండగా.. దీన్ని అడ్డుకున్నారు పోలీసులు. ఈ సమయంలో జనసేన కార్యకర్తలు, పోలీసుల మద్య వాగ్వాదం నెలకొంది. పలువుర్నిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో జనసేన క్యారక్తరపై సీఐ అంజూ చేయిచేసుకుంది. రెండు చెంపలు వాయించింది. దీంతో అతడు కూడా షాక్ అయ్యాడు. శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే కూతురికి కూడా జాగ్రత్తగా ఉండాలంటూ ఆమె వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె తీరుకు వ్యతిరేకంగా జనసేన క్యారకర్తలు ఆందోళన చేపడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.