ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల ఫలితాలు ఊహించని రీతిలో వచ్చాయి. ప్రతిపక్ష టీడీపీ ఏకంగా మూడుకు మూడు స్థానాలు గెల్చుకుంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత, సీఎం జగన్‌ను లక్ష్యంగా చేసుకుని మెగా బ్రదర్ నాగబాబు ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ బాగా వైరల్ అవుతోంది.
జనసేన పార్టీ నేత, మెగా బ్రదర్ నాగబాబు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన హీట్ పెంచారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమిని పరోక్షంగా ప్రస్తావిస్తూ నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. తెలుగు దేశం పార్టీ నేతలు మొదలుపెట్టిన ‘వై నాట్’ నినాదాన్ని నాగబాబు కూడా అందుకున్నారు. ఆయన చేసిన ట్వీట్‌తో ఇప్పుడు జనసేన, వైసీపీల మధ్య వార్ నడుస్తోంది. ఇంతకీ ఆయన ఏమని ట్వీట్ చేశారంటే.. ‘వై నాట్ పులివెందుల’. నాగబాబు కేవలం ‘వై నాట్ పులివెందుల’ అనే ట్వీట్ చేశారు. దీని వెనుక ఓ కారణం ఉంది. వైసీపీ అధినేత, సీఎం జగన్, పార్టీ నాయకులు చాన్నాళ్లుగా ‘వై నాట్ 175 సీట్స్’ అంటున్నారు. అలాగే ‘వై నాట్ కుప్పం’ అంటూ టీడీపీని ఎద్దేవా చేస్తున్నారు.
కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఓటమిపై స్పందిస్తూ వైసీపీ నేతలు ఇలా సెటైర్లు పేల్చారు. ఇప్పుడు నాగబాబు కూడా వైసీపీని లక్ష్యంగా చేసుకున్నారు. ‘వై నాట్ పులివెందుల’ అంటూ సెటైర్లు పేల్చారు. పరోక్షంగా ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్స్‌ను ప్రస్తావించారు. నాగబాబు ట్వీట్‌కు వైసీపీ మద్దతుదారులు కూడా స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇస్తున్నారు. ‘కుప్పం గురించి మీరు నోరు ఎత్తడం లేదంటే.. మనం చంద్రబాబుకు అమ్ముడుపోయామని మీ అభిమానులకు పరోక్షంగా చెబుతున్నట్లే కదా?’ అని కొందరు వైసీపీ సానుభూతిపరులు కామెంట్స్ చేశారు. ‘పులివెందుల కోసం పగటి కలలు మాని.. గాజువాక, భీమవరంలో వాస్తవ పరిస్థితులకు రండి!’ అంటూ వైసీపీ మద్దతుదారులు ఎద్దేవా చేశారు. నాగబాబు ట్వీట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Why Not పులివెందుల..?
— Naga Babu Konidela (@NagaBabuOffl) March 19, 2023
కుప్పం గురించి మీరు నోరు ఎత్తడం లేదంటే … మనం బాబుకి అమ్ముడుపోయామని మీ అభిమానులకు పరోక్షంగా చెబుతున్నట్టే కదా !?
ఇక అసలు విషయానికి వస్తే…. పులివెందుల కోసం పగటి కలలు కనడం మాని…. గాజువాక , భీమవరంలో వాస్తవ పరిస్థితులకు రండి !
— Dhanush Reddyv (@DhaneshwarPola) March 19, 2023