నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న పాపులర్ సెలబ్రిటీ టాక్ షో ‘అన్ స్టాపబుల్’. ఆహా ఓటిటి వారు నిర్వహిస్తున్న ఈ టాక్ షో.. మొదటి సీజన్ ముగించుకుని సెకండ్ సీజన్ లో దూసుకుపోతుంది. నటుడిగా బాలయ్య ఫైర్ ని స్క్రీన్ పై చూసిన ప్రేక్షకులు.. అన్ స్టాపబుల్ షో ద్వారా ఆయనలోని ఎనర్జిటిక్ హోస్ట్ ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే అన్ స్టాపబుల్ షోకి ఎంతోమంది టాలీవుడ్ స్టార్స్ అటెండ్ అయ్యి.. వారి కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో సరదా విషయాలను షేర్ చేసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ‘అన్ స్టాపబుల్ 2’లో పాల్గొని బాలయ్యతో సందడి చేశాడు. ఆల్రెడీ ఒక్క సీజన్ తోనే పాపులర్ అయిన షోలో ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అడుగు పెట్టేసరికి ఒక్కసారిగా అన్ స్టాపబుల్ క్రేజ్ దేశవ్యాప్తంగా పాకింది.
ఇలాంటి తరుణంలో డార్లింగ్ ప్రభాస్ వచ్చిన ఎపిసోడ్ ని రెండు భాగాలుగా డివైడ్ చేసి సర్ప్రైజ్ చేశారు ఆహా వారు. అదీగాక ప్రభాస్ తో పాటు షోలో తన బెస్ట్ ఫ్రెండ్ గోపీచంద్ కూడా పాల్గొనడం విశేషం. ఇక ఇప్పటికే ప్రభాస్ కి సంబంధించి ఫస్ట్ ఎపిసోడ్ న్యూ ఇయర్ సందర్భంగా రిలీజ్ చేశారు. ఇప్పుడు రెండో ఎపిసోడ్ ని జనవరి 6న ఆహాలో స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా ప్రభాస్ రెండో ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో వదిలారు. ప్రోమో అంతా చాలా సందడిగా సాగింది. బాలయ్య చమత్కారం, గోపీచంద్ మొహమాటం, ప్రభాస్ చిలిపితనం అన్ని హైలైట్ అవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా ప్రభాస్ బాలయ్యపై సెటైర్ వేయడం.. నాకే ట్విస్టా అంటూ బాలయ్య రియాక్ట్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత బాహుబలి సినిమాల తర్వాత ప్రభాస్ సినిమాల సెలక్షన్ గురించి అడిగాడు బాలయ్య. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. మరి ప్రభాస్ – బాలయ్య సెకండ్ ఎపిసోడ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.