నటి పూర్ణ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సీమటపాకాయ్ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేసింది. ఇక రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అవును సినిమాలో తన నటనతో అదరగొట్టింది. ఆ తర్వాత చేసిన జయమ్ము నిశ్చయమ్మురా మూవీ కూడా ఆమెకు మంచి హిట్ అందించింది. పూర్ణ ఖాతాలో మంచి హిట్స్ పడ్డప్పటికి ఆమెకు తెలుగులో సరైన అవకాశాలు లభించలేదు. ఇక పూర్ణ ఇప్పటి వరకు తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో కలిపి 40కి పైగా సినిమాల్లో నటించింది. ఇక తాజాగా అఖండలో కీలక పాత్రలో నటించగా.. ఆ తర్వాత సుందరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం పలు టీవీ షోలకు జడ్జీగా వ్యవహిరస్తోంది పూర్ణ
కొన్ని రోజుల క్రితం పూర్ణ ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. యూఏఈకి చెందిన వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. వీరి ఎంగేజ్‌మేంట్ వేడుక కూడా చాలా గ్రాండ్‌గా జరిగింది. వీరి నిశ్చితార్థం వేడుక ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. అయితే ఏమయ్యిందో తెలియదు కానీ.. గత కొన్ని రోజులుగా పూర్ణ పెళ్లికి సంబంధించి ఓ వార్త బాగా వైరల్ అయ్యింది. అదేంటి అంటే.. ఆమె పెళ్లి రద్దు చేసుకుందని. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో.. బ్రేకప్ చేసుకున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం అవుతున్నాయి.
ఈ క్రమంలో తాను పెళ్లి రద్దు చేసుకున్నానంటూ వస్తున్న వార్తలపై పూర్ణ స్పందించారు. ఒక్క ఫోటోతో పుకార్లకు చెక్ పెట్టింది. ఈ క్రమంలో తాజాగా పూర్ణ.. తన కాబోయే భర్తతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. ఫరేవర్ మైన్ అనే క్యాప్షన్ ఇచ్చి పుకార్లకు చెక్ పెట్టింది. దాంతో పెళ్లి క్యాన్సిల్ అనే వార్తలకు ఫుల్‌స్టాప్ పడింది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.