లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘పొన్నియన్ సెల్వన్‘. నలభై యేళ్ళ డ్రీమ్ ప్రాజెక్ట్ గా మణిరత్నం రూపొందించిన ఈ సినిమా.. పొన్నియన్ సెల్వన్ అనే పాపులర్ నవల ఆధారంగా తెరపైకి వచ్చింది. అయితే.. చియాన్ విక్రమ్, కార్తీ, ఐశ్వర్యరాయ్, జయం రవి, త్రిష, ప్రకాష్ రాజ్, శోభిత ధూళిపాళ, ఐశ్వర్యలక్ష్మి లాంటి స్టార్స్ నటించేసరికి ఈ సినిమాపై వరల్డ్ వైడ్ మంచి హైప్ క్రియేట్ అయ్యింది. అదీగాక టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో అంచనాలు పెంచిన పొన్నియన్ సెల్వన్.. వెయ్యేళ్ళ క్రితం చోళ సామ్రాజ్యంలో జరిగిన కథను చెబుతుంది.
ఇక భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా అనౌన్స్ చేసిన పొన్నియన్ సెల్వన్ నుండి మొదటి భాగం.. సెప్టెంబర్ 30న విడుదలైంది. మొదటి షో నుండే మిక్సడ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా.. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 78 కోట్లు వసూల్ చేసింది. అయితే.. కోలీవుడ్ నుండి విడుదలైన సినిమాలలో పొన్నియన్ సెల్వన్ బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టడం విశేషం. కేవలం తమిళనాడు వరకే అయితే పొన్నియన్ సెల్వన్ రూ. 25.86 కోట్ల కలెక్షన్స్ తో ఈ ఏడాది మూడో స్థానంలో నిలిచింది. చోళుల సామ్రాజ్యంలో పాపులర్ అయిన క్యారెక్టర్స్ లో నటించిన హీరో హీరోయిన్స్ పారితోషికాలకు సంబంధించి కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలో పొన్నియన్ సెల్వన్ మూవీలో నటించిన ఒక్కో యాక్టర్ రెమ్యూనరేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం!
ఈ విధంగా సినిమాలో పాత్రను బట్టి నటీనటులకు రెమ్యూనరేషన్స్ భారీగానే ఇచ్చారట నిర్మాతలు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్ పై సుభాస్కరన్, మణిరత్నం సంయుక్తంగా నిర్మించారు. ఎప్పటిలాగే మణిరత్నం సినిమా కాబట్టి.. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్స్ లో విజయవంతంగా దూసుకుపోతోంది. ఇక సినిమా చూసినవారంతా పొన్నియన్ సెల్వన్-2 కోసం ఎదురు చూస్తున్నారు. కానీ.. రెండో భాగం 2023లో రిలీజ్ కాబోతుంది. మొత్తానికి మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి పొన్నియన్ సెల్వన్.. డైరెక్టర్ అయిన 40 ఏళ్ళ తర్వాత తెరమీదకు రావడం విశేషం.