ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలకు కాంట్రవర్సీతో పబ్లిసిటీ జరుగుతోంది. సాంగ్స్, టీజర్, ట్రైలర్, కాస్ట్యూమ్స్.. ఇలా ఏదొక విషయంలో సినిమాలను, సినిమా టీమ్ ని, హీరోహీరోయిన్స్ ని ట్రోల్ చేస్తూ.. హైలైట్ చేస్తున్నారు. ట్రోల్స్ అయినా.. ప్రశంసలైనా చిన్న హీరోల నుండి స్టార్స్ వరకు అతీతమేమి కాదని చెప్పాలి. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన భారీ యాక్షన్ చిత్రం ‘పఠాన్’. సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ సినిమాని జనవరి 25న హిందీ, తమిళ, తెలుగు భాషల్లో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా.. ఈ పఠాన్ సినిమాని ప్రొడ్యూస్ చేశారు.
రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో పఠాన్ మూవీ ప్రమోషన్స్ ని సాంగ్స్ తో ప్రారంభించారు మేకర్స్. తాజాగా పఠాన్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఫుల్ ఆన్ యాక్షన్ సీక్వెన్స్ లతో తో పఠాన్ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో మొన్నటివరకు పఠాన్ సినిమాపై, షారుఖ్ పై ట్రోల్స్ చేసినవారంతా ట్రైలర్ చూశాక సైలెంట్ అయ్యారనే చెప్పాలి. ఎందుకంటే.. పఠాన్ నుండి వచ్చిన బేషరం రంగ్ సాంగ్ పై ఎలాంటి విమర్శలు తలెత్తాయో తెలిసిందే. ఆ సాంగ్ లో దీపికా డ్రెస్సింగ్ కామెంట్ చేస్తూ.. సినిమాని బ్యాన్ చేయాలంటూ డిమాండ్స్ చేశారు. అలాగే సినిమాని ఆపేందుకు ట్విట్టర్ లో నెగిటివ్ హ్యాష్ ట్యాగ్స్ తో రచ్చ చేశారు నెటిజన్స్, ట్రోలర్స్.
ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో షారుఖ్, దీపికా ఇద్దరూ దేశం కోసం పోరాడే సైనికులుగా కనిపిస్తున్నారు. పైగా ట్రైలర్ చివరిలో ట్రోల్ చేసినవారందరికీ ఒకే ఒక్క డైలాగ్ తో సమాధానం చెప్పాడని అనిపిస్తోంది. ‘ఒక సోల్జర్ ఎప్పుడూ దేశం తనకోసం ఏం చేసిందని అడగడు.. దేశం కోసం తనేం చేయగలనా అని ఆలోచిస్తాడు.. జై హింద్’ అని పవర్ ఫుల్ డైలాగ్ చెప్పాడు. ప్రస్తుతం పఠాన్ ట్రైలర్ షారుఖ్ చెప్పిన ఈ డైలాగ్ హైలైట్ అవుతుండగా.. మొన్నటివరకు ఈ సినిమాపై వచ్చిన ట్రోల్స్ అన్నీ పటాపంచలు అయినట్లేనని చెప్పుకోవచ్చు. పఠాన్ మూవీ కేవలం యాక్షన్ మూవీనే కాదు.. దేశం కోసం పోరాటం కూడా ఉందని తెలిసి ఫ్యాన్స్, నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు.
ఇక బేషరం రంగ్ సాంగ్ విషయానికి వస్తే.. సాంగ్ లో కాషాయ దుస్తులు ఉన్నాయని, దీపికా బికినీ అభ్యంతరకరంగా ఉన్నాయని కామెంట్స్ వినిపించాయి. ఆ విషయంలో కూడా మేకర్స్.. సాంగ్ లో హీరోయిన్ దుస్తుల రంగులను చేంజ్ చేశారని సమాచారం. జీరో మూవీ తర్వాత బ్రహ్మాస్త్ర సినిమాలో షారుఖ్ చిన్న రోల్ చేశాడు. దాదాపు నాలుగేళ్ళ తర్వాత సోలో హీరోగా పఠాన్ మూవీతో వస్తున్నాడు. చూడాలి మరి పఠాన్ సినిమాను విపరీతంగా ట్రోల్ చేసిన వారికి సూపర్ హిట్ కొట్టి.. సరైన ఆన్సర్ ఇస్తాడేమో! చూస్తుంటే.. జై హింద్! డైలాగ్ తో విమర్శలు, వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టినట్లేనని సినీవర్గాలు చెబుతున్నాయి. మరి షారుఖ్ పఠాన్ ట్రైలర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.