జైలర్ లో ఒక పాత్ర కోసం బాలకృష్ణను అనుకున్నారట దర్శకుడు. ఈ విషయాన్ని ఆయనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నిజంగా ఆ పాత్ర బాలకృష్ణ చేసి ఉంటే థియేటర్స్ దగ్గర రచ్చ మామూలుగా ఉండేది కాదని నందమూరి ఫ్యాన్స్ అంటున్నారు.
అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు మల్టీస్టారర్ మూవీలు చేసేవారు. వీరి తరం తర్వాత వచ్చిన తరం పెద్దగా మల్టీస్టారర్ సినిమాలు చేసింది లేదు. అతిథి పాత్రల్లో నాగార్జున, మోహన్ బాబు వంటి హీరోలు మిగతా హీరోల సినిమాల్లో కనిపించేవారు. చాలా కాలం తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ లని చూసి ఇది కదా మల్టీస్టారర్ అనుకునేలా చేశారు రాజమౌళి. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో మల్టీస్టారర్ కాన్సెప్ట్ వర్కవుట్ అవ్వదు. ఎందుకంటే ఇద్దరికీ తగ్గట్టు కథ రాయడం అనేది అంత సులువు కాదు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లా క్రేజీ కాంబినేషన్స్ పెద్ద హీరోల విషయంలో కోరుకునేవారు చాలా మంది ఉన్నారు. చిరు, బాలకృష్ణ కాంబినేషన్ కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నారు.
అప్పట్లో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ లు కలిసి ఒక మూవీ తీయాల్సి ఉంది కానీ అది ఆగిపోయింది. అన్ స్టాపబుల్ షోలో ఒకే ఫ్రేమ్ లో కనిపించి కనువిందు చేశారు. తాజాగా రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాలోనూ బాలకృష్ణ ఉండాల్సిందట. ఈ విషయాన్ని దర్శకుడే వెల్లడించారు. రజినీకాంత్, రమ్యకృష్ణ, తమన్నా, సునీల్ తదితరులు నటించిన జైలర్ చిత్రం ఆగస్టు 10న విడుదలై మంచి టాక్ దక్కించుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు నెల్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలోనో ఓ పాత్ర కోసం తొలుత బాలకృష్ణను అనుకున్నట్లు వెల్లడించారు. సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన బాలకృష్ణ గురించి మాట్లాడారు.
జైలర్ సినిమాలో ఒక పాత్ర కోసం బాలకృష్ణను అనుకున్నానని.. కానీ అది సాధ్యపడలేదని అన్నారు. తెర మీద రజినీకాంత్ ఒక్కరు కనిపిస్తేనే జోష్ వస్తుందని.. అందుకే మల్టీస్టారర్ గా ఈ సినిమాని తెరకెక్కించాలని అనుకోలేదని అన్నారు. ప్రత్యేక ఆకర్షణ కోసం మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ లను తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే వీరిని తీసుకోవడం వల్ల జైలర్ సినిమా మల్టీస్టారర్ అని అనుకున్నారని అన్నారు. ఇక ఈ సినిమాలో ఓ పోలీస్ క్యారెక్టర్ కోసం తెలుగు హీరో బాలకృష్ణ అయితే బావుంటుందని అనుకున్నట్లు నెల్సన్ చెప్పుకొచ్చారు.
అయితే కథానుగుణంగా ఆ పోలీస్ పాత్రను బాలకృష్ణకు తగ్గట్టు సరిగా డెవలప్ చేయలేకపోయానని అన్నారు. అలాంటప్పుడు బాలకృష్ణను ఈ సినిమాలో ఎంపిక చేయడం సరైంది కాదనిపించి సంప్రదించలేదని అన్నారు. అయితే ఈ పాత్రను ఆయన ఒప్పుకుంటారో లేదో తర్వాత విషయం.. కానీ భవిష్యత్తులో మాత్రం ఆయనతో సినిమా చేస్తా అని నెల్సన్ అన్నారు. ఒకవేళ ఈ సినిమాలో కనుక బాలకృష్ణ ఉండి ఉంటే కనుక ఓ రేంజ్ లో ఉండేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి జైలర్ లో బాలకృష్ణ నటించి ఉంటే ఎలా ఉండేదో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
మాస్ జాతర జరిగి ఉండేది థియేటర్స్ దగ్గర🔥💥💥@Nelsondilpkumar #NandamuriBalakrishna #Jailer #Rajinikanth https://t.co/et4CDKHqX4
— manabalayya.com (@manabalayya) August 11, 2023