ఈ హీరోయిన్ ఎవరో తెలుసా? బాలకృష్ణతో ఓ సినిమాలో నటించింది. తెలుగులో ఒకే ఒక్క సినిమాలో నటించింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసి ఆధ్యాత్మికంలోకి వెళ్ళిపోయింది. అయితే తాజాగా ఈమెను నెటిజన్స్ టార్గెట్ చేశారు.
కొంతమంది సినిమా వాళ్ళు సినిమాలకు దూరమైనా టెక్నాలజీ పుణ్యమా అంటూ సోషల్ మీడియాకు దగ్గరగా ఉంటూ.. సినిమాల ద్వారా సంపాదించుకోలేకపోయిన స్టార్ డంని సోషల్ మీడియా ద్వారా సంపాదించుకుంటున్నారు. అలాంటి వాళ్ళల్లో తనుశ్రీ దత్త ఒకరు. ఒకప్పటి హీరోయిన్ అయిన తనుశ్రీ దత్త.. నిత్యం ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫొటోలు, వీడియోలు ని షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు అభిమానులని పెంచుకుంటూ ఉంటున్నారు. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులు మాత్రమే కాదు. ట్రోల్ చేసే వీరులు కూడా ఉంటారని తనుశ్రీకి అర్ధమయ్యింది. తనుశ్రీ దత్త ‘ఆషిక్ బనాయా ఆప్‌నే’ అనే హిందీ సినిమాతో సినిమా రంగంలో ప్రవేశించడం జరిగింది. తెలుగులో మాత్రం బాలకృష్ణ హీరోగా 2005లో వచ్చిన ‘వీరభద్ర’ సినిమాలో నటించింది. ఇదే ఆమె మొదటి తెలుగు మూవీ.
తెలుగులో ఆమె నటించిన ఏకైక సినిమా కూడా అదే. ఇక ఆ తర్వాత ఏ తెలుగు సినిమాలోనూ ఆమె నటించలేదు. అయితే వీరభద్ర సినిమాకి సంబంధించి చాలా సంచలనమైన ఆరోపణలే వున్నాయి..షూటింగ్ కి తనుశ్రీ సరిగా వచ్చేది కాదని ఆ మూవీ కి సంబంధించిన మేకర్స్ చెప్పే వారు.. తను కూడా మేకర్స్ మీద కొన్ని ఆరోపణలు చేసింది.ఇక ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్లిపోయారు. అక్కడ కూడా ఆమెకు పెద్దగా ఆదరణ లభించలేదు. అయితే ఆమె లేపిన ఒక వివాదం మాత్రం బాలీవుడ్ ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. నటుడు నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని.. మీటూ ఉద్యమంలో భాగంగా ఆ విషయాన్ని తనుశ్రీ బహిర్గతం చేసింది.
షూటింగ్ సమయంలో నానా పటేకర్ తనని ఎక్కడ పడితే అక్కడ తాకేవాడని చెప్పడంతో బాలీవుడ్ తో పాటు టోటల్ ఇండియన్ సినిమానే ఖంగుతింది. ఎందుకంటే నానాపటేకర్ ఆషామాషీ నటుడు కాదు.. టోటల్ భారతీయ చిత్ర పరిశ్రమే గర్వించదగ్గ నటుడు. బహుశా అందుకేనేమో సోషల్ మీడియాలో తనుశ్రీ దత్తపై పాజిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళ కంటే నెగిటివ్ కామెంట్లు చేసే వాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఇంక అసలు విషయానికి వస్తే ..తనుశ్రీ దత్తా ప్రస్తుతం ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉంది. వారణాసిలోని పవిత్ర గంగానదిలో తాను పవిత్ర స్నానం చేస్తున్న వీడియో ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసారు. ‘కాశీ విశ్వనాథుడి సన్నిధిలో మణికర్ణిక ఘాట్ వద్ద గంగా నదిలో పవిత్ర స్నానం ఆచరించడం గొప్ప అనుభూతిని ఇచ్చింది’ అని క్యాప్షన్ పెట్టి వీడియో పోస్ట్ చేసింది.
ఈ వీడియోను పోస్ట్ చేసిన కాసేపటికే ఆమె మీద నెటిజన్ల నుంచి నెగిటివ్ కామెంట్ల దాడి మొదలైపోయింది. ఒకవైపు తనుశ్రీ దత్తా అభిమానులు ఆమెకున్న భక్తిని మెచ్చుకుంటూ క్యాప్షన్లు పెడుతుంటే మరి కొంతమంది మాత్రం దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే ఆమెకు జాగ్రత్తలు చెబుతున్నారు. నీళ్లు బాగా కలుషితమైనట్టు కనిపిస్తున్నాయని అలాంటి నీళ్లలో స్నానం చేస్తే చర్మ రోగాలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. అయితే చాలా మంది మాత్రం ఆమె పాపులారిటీ కోసం చూసుకుంటుంది కానీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదనే విధంగా ట్రోల్ చేస్తున్నారు..ఇంకొందరైతే ఉన్నది ఉన్నట్లు దైర్యంగా మాట్లాడే తనుశ్రీ దత్త గంగ నది నీళ్లు కలుషితం గురించి మాట్లాడకుండా.. భక్తి గురించి మాట్లాడడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
మొత్తం మీద తనుశ్రీ దత్త పెట్టిన వీడియో కాస్తా ఆ విధమైన నెగిటివ్ కామెంట్ల తో వైరల్‌గా మారింది. 2010 నుంచి సినిమాలకి దూరమైన తనుశ్రీ నటించిన చివరి చిత్రం ‘అపార్ట్‌మెంట్’. రోహిత్ రాయ్, అనుపమ్ ఖేర్, నీతూ చంద్రతో కలిసి తనుశ్రీ దత్తా ఆ సినిమాలో నటించారు. ‘తీరధ విలయాట్టు పిళ్లై’ అనే తమిళ సినిమాలోను విశాల్ సరసన ఆమె నటించారు. ఏది ఏమైనా తనుశ్రీ దత్తతో పాటు అందరికీ అర్థమైన విషయం ఒక్కటే ..ఎంత భక్తి భావంతో చేసిన వీడియోస్ కి సైతం నెగిటివ్ ట్రోల్ల్స్ చేసే వాళ్ళు ఉంటారని..ఫైర్ బ్రాండ్ అయిన తనుశ్రీ దత్త నెగిటివ్ కామెంట్స్ కి ఘాటైన రిప్లై ఇస్తుందో లేక ఎవరి పాపాన వాళ్ళే పోతారు అని అనుకుని తన ఆధ్యాత్మికతకు నిండుదనాన్ని ఇస్తుందో చూడాలి.
View this post on Instagram
A post shared by Tanushree Dutta Miss India Universe (@iamtanushreeduttaofficial)