అందచందాలతో యాంకరింగ్ చేస్తూ తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను సంపాందించుకుంది వర్షిణి. ఈటీవీ, మాటీవీల్లో ప్రసారమైన పలు కార్యక్రమాల్లో యాంకర్ గా రాణించింది. అంతేకాకుండా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసింది. అయితే ఇప్పుడు ఆమె షేర్ చేసిన ఫోటోపై దారుణమైన కామెంట్లు వస్తున్నాయి.
బుల్లితెరపై అనేక మంది యాంకర్స్ తమ సత్తాను చాటుతున్నారు. అయితే వీరిలో హాట్ యాంకర్ ఎవరు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది వర్షిణి సౌందర్ రాజన్. ముద్దు ముద్దు మాటలతో.. అందచందాలతో యాంకరింగ్ చేస్తూ తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను సంపాందించుకుంది. వర్షిణి ఆ మధ్య స్టార్ మాలో వచ్చిన కామెడీ స్టార్స్ అనే షోలో యాంకరింగ్ చేసింది. ఈటీవీలో వచ్చే పటాస్-2తో పాటు డాన్స్ షోలో యాంకరింగ్ చేస్తూ అక్కడ ఓ టీమ్ లీడర్‌గా అలరించింది. అటు యాంకరింగ్‌తో పాటు వెబ్ సిరీస్‌లు, అడపాదడపా సినిమాలు చేస్తోంది. సోషల్ మీడియాలో కూడా బిజీగా ఉండే వర్షిణి.. ఇటీవల ఓ స్టార్ క్రికెటర్‌తో దిగిన ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటో షేర్ చేయడంతో ఆమెపై దారుణమైన కామెంట్స్ చేశారు.
టాటా ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఈ నెల 18న ముంబై-హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌కి యాంకర్ వర్షిణి సుందరరాజన్ హాజరయ్యింది. ఈ క్రమంలో ముంబయి ఇండియన్స్ క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్‌తో ఆమె సెల్ఫీ దిగింది. ఆ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేయగా.. నెటిజన్లు ఆమెపై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. వారిద్దరి మధ్య రిలేషన్ అంటగడుతూ ఆమెపై దూషణలు చేస్తున్నారు. ‘నిన్ను ఎవ్వరు రానిచ్చారు లోపలికి, ఈ రోజు నైట్‌కి ఇద్దరు కలిసి పార్టీ చేసుకుంటున్నారా, భాయ్‌కి పెళ్లి అయిపోయిందీ అయినా వదలవా’ అంటూ వరస్ట్ కామెంట్లతో రెచ్చిపోతున్నారు. బూతు వ్యాఖ్యలు చేస్తున్నారు.
తన ఫేవరేట్ క్రికెటర్ తో కలిసి దిగిన ఫోటోను ఆమె పంచుకోగా.. తప్పుడు దృష్టితో చూస్తున్న నెటిజన్లు.. సోషల్ మీడియా వేదికగా ఇష్టమొచ్చిన రాతలు రాస్తున్నారు. ఎంత సెలబ్రిటీ అయినా.. తనకంటూ పర్సనల్ లైఫ్ అంటూ ఒకటుంటుందనీ ఆలోచించని వ్యక్తులు ఇలా కామెంట్స్ చేస్తున్నారు. ఆమె పట్ల నెటిజన్లు వ్యవహరిస్తున్న తీరు చాలా జుగుప్పాకరంగా ఉంది. ఇక వర్షిణి కెరీర్ పరిశీలిస్తే లేటెస్ట్ రిలీజ్ శాకుంతలం చిత్రంలో వర్షిణి తళుక్కున మెరిసింది. ఆమె ఓ పాత్ర చేసింది. అంతకు ముందు సుమంత్‌తో కలిసి మళ్లీ మొదలైంది సినిమాలో నటించింది. కాయ్ రాజా కాయ్, లవర్స్, బెస్ట్ యాక్టర్స్ వంటి సినిమాల్లో కనిపించింది. ఈ సినిమాలన్నీ ఆమెను నిరాశపరిచినవే. ఇన్ని సినిమాలు చేసినా ఆమెకు సరైన బ్రేక్ రాలేదని చెప్పవచ్చు. అటు యాంకరింగ్ లో కూడా ఇంకా స్టార్ స్థాయికి ఎదగలేదు ఈ బ్యూటీ.