దక్షిణాదిని లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకుంది నయనతార. ఇక గత కొన్ని రోజులుగా నయనతార-విఘ్నేష్ శివన్‌ల పెళ్లి గురించి నెట్టింట బోలేడు వార్తలు ప్రచారం అయ్యాయి. తామిద్దరం వివాహం చేసుకోబోతున్నట్లు విఘ్నేష్ శివన్ స్వయంగా ప్రకటించాడు. జూన్ 9, గురువారం తెల్లవారుజామున వీరి వివాహం జరిగింది. మహాబలిపురంలోని షెరిటన్ హోటల్ లో హిందూ సాంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగభరితమైన పోస్ట్ చేశాడు. ఈ క్రమంలో షెరిటన్ హోటల్లో జరిగిన ఈ వేడుకలో పలువురు సెలబ్రిటీలు సందరడి చేశారు. ముఖ్యంగా బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, రజనీకాంత్, రాధికా శరత్‌కుమార్ దంపతులు, దిలీప్‌కుమార్, బోనీ కపూర్, దర్శకుడు అట్లీ తదితరులు వీరి వివాహానికి హాజరయ్యారు.
పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు బయటకు లీక్ కాకుడదనే ఉద్దేశంతో.. వేదిక వద్దకు సెల్ ఫోన్లను నిషేధించినట్లు సమాచారం. అతిథులంతా తమ సెల్ ఫోన్లను వేదిక బయటే ఒక సురక్షిత ప్రదేశంలో ఉంచి వేడుకకు హాజరయినట్లు తెలుస్తోంది. ఇక ఈ పెళ్లి వేడుక జరుగుతున్న మహాబలిపురంలోని షెరటాన్ పార్క్ హోటల్లోనే జూన్ 7న మెహందీ, సంగీత్ వేడుకలను నిర్వహించారట. దానికి హాజరైన అతిథులకు సరఫరా చేసిన వాటర్ బాటిల్స్‌పై నయన్, విఘ్నేశ్ బొమ్మలతో పాటు, వారి లవ్ స్టోరీలోని వివిధ దశలను కూడా ప్రింట్ చేయించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక షెరటాన్ పార్క్ హోటల్లో ఏర్పాటుచేసిన ఒక భారీ గాజు మండపంలో నయనతార, విఘ్నేశ్ పెళ్లి కన్నుల పండువగా జరిగినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Nayantara: కాబోయే భర్త కోసం నయన్ రూ.20 కోట్ల విలువైన సర్పైజ్ గిఫ్ట్!ఇక వివాహానికి కొన్ని గంటల ముందు విఘ్నేష్ శివన్ ఓ భావోద్వేగపూరిత పోస్ట్‌ను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఈ రోజు నయన్ డే అని ఆయన చెప్పాడు. మంచి వ్యక్తులు, మంచి సమయాలు, అనుకోని మధురమైన ఘటనలు, అందరి ఆశీస్సులు, దేవుడి ప్రార్థనలు, షూటింగ్ రోజులు… తన జీవితం ఇంత ఆనందంగా ఉండేందుకు ఇదే కారణమని తెలిపాడు. ఈ ఆనందమైన జీవితాన్ని ‘లవ్ ఆఫ్ మై లైఫ్’ నయన్ కు అంకితం చేస్తున్నానని చెప్పాడు. పెళ్లికూతురుగా ముస్తాబై, వేదికపైకి వస్తున్న నయన్‌ని చూసేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నానని రాసుకొచ్చాడు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో జీవితంలో మరో అంకాన్ని ప్రారంభించేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాని ఆ పోస్ట్‌లో తెలిపాడు. ఇక వీరి పెళ్లి వార్త తెలిసి అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Nayanthara: తన పెళ్లికి రాబోయే అతిథులకు కండిషన్ పెట్టిన నయనతార..!