Ante Sundaraniki OTT: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, మలయాళీ బ్యూటీ నజ్రియా నాజిమ్ హీరోహీరోయిన్లుగా నటించిన కామెడీ లవ్ డ్రామా ‘అంటే సుందరానికి’. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాను ‘బ్రోచేవారెవరురా’ ఫేమ్ వివేక్ ఆత్రేయ తెరకెక్కించాడు. ఇక ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన అంటే సుందరానికి.. బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాన్ని అందుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో విడుదలైంది.
ఇదిలా ఉండగా.. ఈ మధ్య బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న పాన్ ఇండియా సినిమాలే.. విడుదలైన రెండు నెలలులోపు ఓటిటిలో రిలీజ్ అవుతున్నాయి. అదీగాక కాస్త అటు ఇటుగా టాక్ వచ్చిందంటే నెలలోపే స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ‘అంటే సుందరానికి’ మేకర్స్ కూడా వీలైనంత త్వరగా ఈ మూవీని ఓటిటిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అయితే.. అంటే సుందరానికి మూవీ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ చేజిక్కించుకుంది. ఇక తెలుగు, తమిళం, మలయాళంతో పాటు కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ చేయాలని యోచిస్తున్నారట.
ఈ సినిమాలో నాని, నజ్రియా జోడి అన్నప్పుడే అంచనాలు పెరిగిపోయాయి. అంతేగాక, ప్రస్తుతం వరుస బ్లాక్ బస్టర్స్ లో ఉన్న మైత్రి మూవీస్ ప్రొడక్షన్, వివేక్ ఆత్రేయ డైరెక్షన్.. ఈ అంశాలన్నీ ‘అంటే సుందరం’ పై భారీ హైప్ క్రియేట్ చేశాయి. కానీ.. అంత బజ్ క్రియేట్ అయినప్పుడు సినిమా ఎక్సపెక్ట్ చేసిన స్థాయిలో లేకపోతే ఏమవుతుందో తెలిసిందే. ఈ సినిమాకు కూడా సరిగ్గా అదే జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. అంటే సుందరానికి మూవీ జూలై 8 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుందని సినీవర్గాలు చెబుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.