నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన టైమ్ ట్రావెల్ ఫాంటసీ చిత్రం ‘బింబిసార’. చాలా గ్యాప్ తర్వాత మంచి విజయాన్ని అందుకోవడంతో కళ్యాణ్ రామ్ తో పాటు బింబిసార చిత్రయూనిట్, నందమూరి ఫ్యాన్స్ అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తిచేసిన ఈ సినిమాపై ఇప్పటికే సెలబ్రిటీలు, విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు. అయితే. తాజాగా బింబిసార సినిమాను ఫ్యామిలీతో వీక్షించారు నటసింహం నందమూరి బాలకృష్ణ.
ఇక సినిమా చూసిన అనంతరం బింబిసార దర్శకుడిని, అబ్బాయ్ కళ్యాణ్ రామ్ ని అభినందించాడు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. “బాగుందయ్యా బ్రహ్మాండం.. ఇలాంటి మంచి సినిమాలు ఇంకా అందివ్వాలి. బాగా చేశారు. త్వరలో చేద్దాం. ఇటువంటి భారీ సినిమాలు మరిన్ని రావాలి. ఇట్టా అవకాశం ఇవ్వడం మా నందమూరి వంశానికే దక్కుతుంది. కొత్త వాళ్ళని చూడకుండా టాలెంట్ ఉంటే నమ్మకంతో అవకాశం ఇస్తాం. ప్రేక్షకులు కూడా సినిమాను ఆదరించి మరోసారి తెలుగువాళ్ళని నిరూపించుకున్నారు.
కొత్త కొత్త సినిమాల ఒరవడి రామారావు గారితోనే ప్రారంభమైంది. ఏదైనా మాతోనే ప్రారంభం కావాల్సిందే. అప్పట్లో ఆయన చేసిన ప్రయోగాత్మక సినిమాలను మీరు ఆదరిస్తూ వచ్చారు. బింబిసార ప్రయోగాత్మక సినిమాయే కాదు. ఇందులో నిజాలున్నాయి. అది మీరు నమ్మండి. సినిమాలో భావితరాలకు కూడా మంచి సందేశం ఉంది.” అంటూ చెప్పుకొచ్చారు. మరి బాలయ్య మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి బాలయ్య మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.