బాలకృష్ణ అంటేనే యాక్షన్ సన్నివేశాలకు పెట్టింది పేరు. బాలకృష్ణ నటించబోయే సినిమాలో భారీ యాక్షన్ సీన్ ని ప్లాన్ చేశారు మేకర్స్.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంకో క్రేజీ కాంబినేషన్ సినీ అభిమానుల్ని రంజింపజేయడానికి ముస్తాబవుతుంది. తాజాగా ఆ మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం అవ్వబోతుంది. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన కనీవినీ ఎరుగని రీతిలో ఒక భారీ సెట్ ని నిర్మిస్తున్నారనే టాక్ తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక ఊపు ఊపుతుంది. అంతలా క్రేజ్ ఏర్పడటానికి ఆ మూవీ అలాంటి ఇలాంటి మూవీ కాదు. ఈ మూవీ కోసం వేస్తున్న సెట్టు మాములు సెట్టు కాదు. హీరో సింహంతో పోరాడే సెట్. ఆ హీరో కూడా ఒక సింహమే. ఆ హీరో డైలాగ్ చెప్పే విధానం కూడా సింహం వేటాడుతున్నట్లే ఉంటుంది.
యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా క్రేజీ డైరెక్టర్ బాబీతో హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఒక భారీ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఈ మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభం కానుంది. ఎంతో ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని కథ ప్రకారం బాలకృష్ణ ఇంట్రడక్షన్ కి సంబంధించిన సీన్ ని ప్లాన్ చేస్తున్నారు. ఆ సీన్ కి సంబంధించిన సెట్ నే రామోజీ ఫిలిం సిటీ లో నిర్మిస్తున్నారు. ఈ సీన్ లో బాలకృష్ణ సింహం తో పోరాడే సన్నివేశాన్ని చిత్రకరిస్తున్నారు.
ఈ వార్త బయటకు వచ్చిన దగ్గర నుంచి నందమూరి అభిమానుల ఆనందానికి ఐతే అవధులు లేవు. బాలకృష్ణ అంటేనే పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ కి పెట్టింది పేరు.పైగా బాలయ్యకి నందమూరి నటసింహం అనే పేరు కూడా ఉంది.సో రెండు సింహాలు డీ కొట్టుకోబోతున్నాయి. బాబీ, బాలయ్య ల కాంబినేషన్ లో రాబోతున్నఈ మూవీ ఫ్యామిలీ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ ఆధారంగా తెరకెక్కుతోందని తెలుస్తుంది. కథ ప్రకారం మూవీలో కొంత పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కూడా ఉందని తెలుస్తుంది. అదే కనుక నిజమైతే బాలయ్య అభిమానులకి, సినీ ప్రేక్షకులకి పండగే అని చెప్పవచ్చు.ఈ మూవీ లో బాలకృష్ణ క్యారెక్టర్ కొత్తగా ఉండబోతుందని.. ఈ మూవీలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించబోతున్నారు.