నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడిల క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ‘భగవంత్ కేసరి’. ‘ఐ డోంట్ కేర్’ అనేది ట్యాగ్ లైన్. కాజల్ అగర్వాల్ కథానాయిక కాగా.. యంగ్ టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది.
నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడిల క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ‘భగవంత్ కేసరి’. ‘ఐ డోంట్ కేర్’ అనేది ట్యాగ్ లైన్. కాజల్ అగర్వాల్ కథానాయిక కాగా.. యంగ్ టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద సాహూ గారపాటి – హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ విలన్‌గా నటిస్తున్నారు. బాలయ్య బర్త్‌డేకి రిలీజ్ చేసిన టీజర్ సినిమా అంచనాలు పెంచేసింది. తెలంగాణ యాసలో డైలాగ్స్ అదరగొట్టేశారు బాలయ్య. ‘భగవంత్ కేసరి ఆయుధ పూజతో గీ సారి దసరా జోర్దారుంటది’ అంటూ అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు.
రిలీజ్ డేట్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. పండక్కి లాంగ్ వీకెండ్ కలిసొచ్చేలా ప్లాన్ చేశారు. అక్టోబర్ 24న దసరా అంటే.. 19 నుంచి దాదాపు వారం పాటు బాక్సాఫీస్ బరిలో సత్తా చాటే అవకాశముంది. 60+ వయసులోనూ కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు బాలయ్య. ఈ మూవీలో ఏజ్డ్ క్యారెక్టర్‌లో, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్‌తో కనిపించనున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుటోంది. రీసెంట్‌గా ‘భగవంత్ కేసరి’ నుంచి ఓ డైలాగ్ లీక్ అయ్యింది అంటూ బాలయ్య ఫ్యాన్స్ వాట్సాప్ గ్రూపుల్లో తెగ చక్కర్లు కొడుతోంది.
సాధారణంగా బాలయ్య అంటేనే పవర్ ఫుల్ డైలాగ్స్.. డైలాగ్స్ అంటేనే బాలయ్య అనేలా ఆయన పలికే డైలాగులు థియేటర్లలో డైనమెట్స్‌లా పేలుతుంటాయి. ఇక ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించేలా ఉన్న ఆ డైలాగ్ ఏంటంటే.. ‘‘ఊర్లో ఉన్న కుక్కలు ఊర్లోనే మొరగాలి.. అడవిలో మొరిగితే సింహం ఊరుకుంటుందా?.. గర్జిస్తుంది.. అడవి బిడ్డ, ‘భగవంత్ కేసరి’..’’ అనే సాలిడ్ డైలాగ్ బాలయ్య చెప్పాడని అంటున్నారు. ఇదే కనుక సినిమాలో ఉంటే నందమూరి ఫ్యాన్స్‌కి గూస్ బంప్సే. ‘అఖండ’, ‘వీర సింహా రెడ్డి’ తర్వాత వస్తున్న ఈ ఫిలింతో బాలయ్య హ్యాట్రిక్ కొట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఇది కూడా చదవండి : మోక్షజ్ఞ మొదటి మూవీలో మరో స్పెషల్! ఫ్యాన్స్ కు పండగే!