నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తూ.. యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. తన కాల్ షీట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. అయితే తన కొడుకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి చాలా కాలం నుంచి చర్చలు నడుస్తున్నాయి.
నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తూ.. యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. తన కాల్ షీట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. అయితే తన కొడుకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి చాలా కాలం నుంచి చర్చలు నడుస్తున్నాయి. ఎప్పటి నుంచో తమ అభిమాన హీరో కొడుకు సినీ రంగ ప్రవేశం కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఫ్యాన్స్ కి ఆనందించే విషయం ఒకటి బయటకు వచ్చింది. దీంతో అభిమానుల్లో సందడి మొదలయ్యింది. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉంటుందని బాలకృష్ణ స్వయంగా తెలిపారు. అప్పటి నుంచి మోక్షజ్ఞ పై అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకి రాబోయే సినిమాకి డైరెక్టర్ ఎవరు? హీరోయిన్ ఎవరు? అసలు హీరోని ఎలా చూపియబోతున్నారు. లవ్ స్టోరీ నా లేక యాక్షన్ స్టోరీనా ఇలా అనేక ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇటీవల అమెరికా వెళ్లి తానా సభలో పాల్గొన్న బాలకృష్ణ.. తన కొడుకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై మరోసారి ఓపెన్ అయ్యారు. తన కొడుకుని వచ్చే సంవత్సరం టాలీవుడ్ కి పరిచయం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఆదిత్య 369 సీక్వెల్‌తో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉంటే బాగుంటుందని బాలయ్య ఆలోచిస్తున్నారట. మాస్ డైరెక్టర్ అయిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినీ ఎంట్రీ ఉంటుందని మరికొందరు అభిప్రాయపడతున్నారు. బోయపాటి శ్రీను అయితే హీరోలను ఒక రేంజ్‌లో చూపిస్తాడని బయట టాక్ ఉంది. ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో కానీ తమ అభిమాన హీరో తనయుడు సినిమాలలోకి వస్తున్నాడనే విషయం ఆసక్తికరంగా మారింది. అయితే మరో విషయం ఏంటంటే మోక్షజ్ఞ ఎంట్రీ కోసం యూత్ అండ్ పవర్ ఫుల్ స్టోరీని లాక్ చేరని ప్రచారం జరుగుతుంది.
ఈ సినిమా మోక్షజ్ఞ చిన్నప్పటి క్యారెక్టర్ కోసం బాలకృష్ణ కూతురి కొడుకుని తీసుకుంటారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే నందమూరి అభిమానుల్లో మరింత ఉత్సాహం రానుంది. ఎప్పుడో సినీ రంగ ప్రవేశం చేయల్సింది అయితే కొన్ని కారణల వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది. రీసెంట్‌గా మోక్షజ్ఞ పుట్టిన రోజు ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. తన సినీ ఎంట్రీ కోసం మోక్షజ్ఞ చాలా కష్టపడుతున్నారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే బాలకృష్ణ సొంతంగా ఓ నిర్మాణ సంస్థ ప్రారంభించబోతున్నారని, ఆ నిర్మాణ సంస్థ ద్వారానే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉండేలా ప్లాన్స్ చేస్తున్నారనే మరో టాక్ నడుస్తోంది. ఏదేమైనా మోక్షజ్ఞను వెండితెరపై చూడాలని నందమూరి అభిమానులు ఆతృతగా ఎదురుచుస్తున్నారు.