సెలబ్రిటీలు కూడా సాధారణ మనుషుల్లానే దైవభక్తిని కలిగి ఉంటారు. అయ్యప్ప మాలలు, భవానీ మాలలు ధరిస్తూ తమ భక్తిని చాటుకుంటూ ఉంటారు. ఇక హీరోయిన్లు అయితే వీలు చిక్కినప్పుడల్లా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలను, ఆలయాలను సందర్శిస్తూ ఉంటారు. రష్మిక మందన్న, తమన్నా లాంటి హీరోయిన్లు ఆలయాలను సందర్శించడమే కాకుండా ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. తాజాగా మహేష్ సతీమణి నమ్రతా శిరోద్కర్ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు.
సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు భగవంతునిపై తమకున్న భక్తిని చాటుకుంటూ ఉంటారు. హీరోలైతే అయ్యప్ప మాలలు ధరించి భక్తిని చాటుకుంటే.. హీరోయిన్లు, నటీమణులు ప్రముఖ ఆలయాలను సందర్శించడం ద్వారా తమ భక్తిని చాటుకుంటారు. ఈ క్రమంలో మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పట్ల భక్తిని చాటుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆ గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. పద్మావతి, అలివేలు మంగ సమేత వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ గోశాలను కూడా సందర్శించారు.
తెలంగాణ చిన్న తిరుపతిగా పేరు పొందిన ఈ వట్టెం గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నమ్రతా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ ఆలయాన్ని చూస్తే తిరుపతి వెళ్లిన అనుభూతి కలుగుతుందని, వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం తనకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. గుట్టపై ఆహ్లాదకరమైన వాతావరణంలో శ్రీవారు కొలువు తీరారని అన్నారు. నమ్రతకు ఆలయ సిబ్బంది పుష్పగుచ్చాలు అందించి, శాలువా కప్పి సత్కరించారు. ఆలయ విశిష్టతను తెలియజేసే పుస్తకాన్ని ఆమెకు అందజేశారు.
బిజినేపల్లి నుండి 6 కి.మీ, వనపర్తి నుంచి 35 కి.మీ. దూరంలో ఉంది ఈ వట్టెం కొండ. మొదట్లో దీన్ని అడ్డగట్టు అని పిలిచేవారు. ఇక్కడ వట్టెం వేంకటేశ్వరుడు పుట్ట నుంచి ఆవిర్భవించాడని స్థానికులు చెబుతారు. ఈ ప్రాంతానికి సమీప గ్రామంలో నివసించే ఒక యాదవుడు పుట్టను గుర్తించి పూజలు చేస్తూండేవాడట. అది చూసి ప్రజలు పూజలు చేయడం మొదలుపెట్టారని స్థానికులు చెబుతారు. అలాంటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు నమ్రతా శిరోద్కర్. మరి స్వామి పట్ల భక్తిని చాటుకున్న నమ్రతా శిరోద్కర్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.