పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్‘ OTT సీజన్ సందడి మొదలైపోయింది. ఫిబ్రవరి 26 నుండి డిస్నీ హాట్ స్టార్ లో ఓటిటి సీజన్ 24 గంటలపాటు ప్రసారం చేయనున్నారు. అయితే.. ప్రస్తుతానికి సీజన్ 84 రోజులుపాటు సాగుతుందని.. ప్రేక్షకుల స్పందన బట్టి మరిన్ని రోజులు పొడిగించే అవకాశం ఉందని తెలుస్తుంది.
బిగ్ బాస్ ఓటీటీ హిందీ భాషలో సక్సెస్ అయ్యేసరికి.. తెలుగులో కూడా ఓటిటి సీజన్ తీసుకొచ్చేశారు. బిగ్ బాస్ టీవీ షోకి ఏ మాత్రం తీసిపోకుండా కంటెస్టెంట్ లను తీసుకొస్తున్నట్లు టీవీ వర్గాలలో టాక్. అయితే.. ఓటిటి కంటెస్టెంట్స్ లిస్ట్ లో రాంగోపాల్ వర్మ పరిచయం చేసిన ‘నగ్నం‘ ఫేమ్ హీరోయిన్ శ్రీరాపాక రానుందని సమాచారం. వర్మ స్కూల్ నుండి వచ్చిన ఈ బ్యూటీ.. ఏ స్థాయిలో గ్లామర్ షో చేస్తుందో యూత్ కి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఇక బిగ్ బాస్ హౌజ్ లోకి శ్రీరాపాక అలియాస్ స్వీటీ వచ్చిందంటే అంతే అంటున్నారు. అదీగాక 24 గంటల షో కాబట్టి గ్లామర్ డోస్ ఎలా ఉండబోతుందో అని ఆసక్తి మొదలైంది. సీజన్ 5లో ముద్దులు, హగ్గులు, బెడ్ పై రొమాన్స్లు చాలానే చేశారు. మరి ఈసారి బిగ్ బాస్ ఓటీటీలో గ్లామర్ బ్యూటీలు వస్తే ఏంటి సంగతి అంటున్నారు.ఇక పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన స్వీటీతో ‘నగ్నం’ అనే చిత్రాన్ని తీసి ఆన్ లైన్ లో రిలీజ్ చేశాడు. అయితే.. ఇండస్ట్రీలో పలు సినిమాలకు ఫాషన్ డిజైనర్ గా పనిచేసిన స్వీటీ.. ‘నగ్నం’ మూవీతో హీరోయిన్ గా పెద్ద రచ్చే చేసింది. చివరిగా లస్ట్ సినిమాలో కనిపించింది. మరి స్వీటీ లాంటి కంటెస్టెంట్ బిగ్ బాస్ లో అడుగుపెడితే మమూలుగా ఉండదు మరి అంటున్నారు నెటిజన్లు. ఇక శ్రీరాపాక బిగ్ బాస్ ఎంట్రీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.