‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ పురస్కారం రావడంతో యావత్ భారత్ పులకించిపోతోంది. దేశ జెండా ప్రపంచ యవనికపై ఎగురుతుండటంతో గర్వంతో ఉప్పొంగిపోతున్నారు ఇండియన్స్.
తెలుగు సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట గౌరవం లభించింది. టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తీసిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఆస్కార్ పురస్కారాల్లో సత్తా చాటింది. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు దక్కింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్‌ను దక్కించుకుంది ‘ఆర్ఆర్ఆర్’. ఈ పురస్కారాన్ని గేయ రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు కీరవాణి కలసి అందుకున్నారు. ‘నాటు నాటు’కు ప్రతిష్టాత్మక పురస్కారమైన ఆస్కార్ దక్కడంతో మొత్తం భారతావని సంతోషంలో మునిగిపోయింది. చిత్ర యూనిట్‌పై రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా బృందానికి అభినందనలు తెలిపారు.
‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘ఆర్ఆర్ఆర్’లోని నాటు నాటు గీతం ఆస్కార్ అందుకోవడం అభినందనీయం. చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందలు తెలియజేస్తున్నాను’ అని వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు. అటు ‘నాటు నాటు’కు ఆస్కార్ వచ్చినందుకు రాజమౌళి, కీరవాణి, ఎన్టీఆర్, చరణ్, చంద్రబోస్‌తో పాటు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్‌కు అభినందనలు తెలుపుతూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ‘ఆస్కార్‌ను దక్కించుకోవడం ద్వారా చరిత్రలో తన స్థానాన్ని కైవసం చేసుకుంది ‘నాటు నాటు’. ఇది భారతీయ సినిమాకు అత్యుత్తమ క్షణంగా చెప్పాలి. తెలుగువాళ్లు దీన్ని సాధించడం మరింత ప్రత్యేకమైనది’ అని చంద్రబాబు ట్వీట్లో రాసుకొచ్చారు.
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో #RRR లోని నాటు నాటు గీతం ఆస్కార్ అందుకోవటం అభినందనీయం.
చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. #Oscars pic.twitter.com/Ykdf50FsyH— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) March 13, 2023
‘Naatu Naatu’ has sealed its place in history by winning the Academy Award for Best Original Song at the #Oscars. This is probably the finest moment for Indian Cinema and Telugus achieving it is even more special.(1/2) pic.twitter.com/BAKVLsPVxf
— N Chandrababu Naidu (@ncbn) March 13, 2023