చిన్న సినిమా 'బలగం'.. వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన 'ఆర్ఆర్ఆర్'ని ఓ విషయంలో అధిగమించింది. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ ఏంటి సంగతి?
‘ఊరు.. పల్లెటూరు..’ అంటూ తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న మూవీ ‘బలగం’. అసలు ఏ మాత్రం అంచనాల్లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. నమ్మశక్యం కాని రీతిలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సింపుల్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో తీసినప్పటికీ.. ప్రేక్షకులకు విపరీతంగా ఎక్కేసింది. దీంతో ఈ చిన్న సినిమాని నెత్తిన పెట్టుకున్నారు. మళ్లీ మళ్లీ చూశారు. ఇప్పుడు ఈ చిత్రం.. ఏకంగా ‘ఆర్ఆర్ఆర్’ నెలకొల్పిన ఓ రికార్డుని బ్రేక్ చేసి పడేసింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటా రికార్డు? ఏం జరిగింది?
అసలు విషయానికొచ్చేస్తే.. రీసెంట్ టైమ్ లో నేటివిటీ కథలతో వస్తున్న సినిమాలు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. అలా తెలంగాణలో ఎప్పటినుంచో ఉన్న పిట్టముట్టుడు అనే కాన్సెప్ట్ తో తీసిన మూవీ ‘బలగం’. ఇందులో దీని గురించి చెబుతూనే కుటుంబం అంతా బలగంలా కలిసుండాలనే సందేశాన్ని చాలా చక్కగా కన్వే చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి విశేషాదరణ లభించింది. ‘జబర్దస్త్’లో కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నే వేణు.. డైరెక్టర్ గా మారి తీసిన తొలి సినిమా ఇదని ఎవరికీ చెప్పినా సరే నమ్మరు. ఎందుకంటే అంతా బాగా తీశాడు.
సరే ఈ విషయాలన్నీ వదిలేస్తే.. థియేటర్-ఓటీటీలో సూపర్ హిట్ అయిన ‘బలగం’ రీసెంట్ గా టీవీలో ప్రసారం చేస్తే అక్కడ కూడా బ్లాక్ బస్టర్ కొట్టింది. 14.3 రేటింగ్ తో హిట్ కొట్టేసింది. కేవలం హైదరాబాద్ వరకు తీసుకుంటే ‘బలగం’కి 22 రేటింగ్ వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ‘ఆర్ఆర్ఆర్’ మూవీని టీవీలో టెలికాస్ట్ చేస్తే 19 రేటింగ్ మాత్రమే వచ్చింది. దీన్నిబట్టి చూస్తే బుల్లితెర రేటింగ్ విషయంలో ‘ఆర్ఆర్ఆర్’ని చిన్న సినిమా అయిన ‘బలగం’ అధిగమించిందనే చెప్పొచ్చు. మరి దీనిపై మీరేం అంటారు? కింద కామెంట్ చేయండి.