తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా చూడని దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ప్రపంచ స్థాయిలో ఒక ప్రభంజనం సృష్టించింది.
తెగులు ఇండస్ట్రీలో ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ఒకటి ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల ఫేమ్ మార్చేశారు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ మూవీకి అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. మన దేశంలోనే కాదు.. ఇతర దేశాల్లో కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆర్ఆర్ఆర్ మూవీకి ఎన్నో అరుదైన గౌరవాలు దక్కాయి. అంతర్జాతీయంగా అస్కార్, గోల్డెన్ గ్లోబ్ సహా ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి. ఈ మూవీ రిలీజ్ అయి ఏడాది గడుస్తున్నా.. ఇప్పటికీ దీని ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. ఈ చిత్రంలో నటించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ కి మరో అరుదైన గౌరవం లభించింది. వివరాల్లోకి వెళితే..
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టించింది. అంతేకాదు అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు కొల్లగొట్టింది. ఈ మూవీలో ‘నాటు నాటు’ సాంగ్ కి ఏకంగా ఆస్కార్ అవార్డు వచ్చింది. అంతేకాదు ఈ మూవీ ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు కైవసం చేసుకుంది. ఈ మూవీ విదేశాల్లో సైతం భారీగా కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇప్పటికే జపాన్ లో వన్ మిలియన్ కి పైగా డబ్బులు వసూళ్లు చేసింది. తాజాగా ఈ మూవీలో నటించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ కి మరో అరుదైన గౌరవం దక్కింది. జపాన్ లో పాపులర్ మ్యాగజైన్ ‘ఆన్ఆన్’ కవర్ పేజీప్ ఎన్టీఆర్-రామ్ చరణ్ ఫోటోలు ప్రచురించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ మొదటి మూవీ ‘మగధీర’. ఈ మూవీ రామ్ చరణ్ ఒక్కసారే స్టార్ హీరోగా మార్చింది. మూవీతో రాజమౌళి-ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన స్టూడెంట్ నెం.1 బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత సింహాద్రి, యమదొంగ బ్లాక్ బస్టర్ విజయాలుగా నిలిచాయి. రాజమౌళి దర్శకత్వంలో ఇద్దరు టాలీవుడ్ టాప్ హీరోలు కలిసి నటించిన ‘ఆర్ఆర్ఆర్’మూవీపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆర్ఆర్ఆర్ చిత్రం ఘన విజయం సాధించడమే కాదు.. కలెక్షన్ల వర్షం కురిపించింది. ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు కైవసం చేసుకుంది.
Our heroes are featured on the cover page of Japan’s highly acclaimed lifestyle magazine, @anan_mag!🔥🌊❤️ #RRRMovie #RRRinJapan pic.twitter.com/Mrd2Ir0sV4
— RRR Movie (@RRRMovie) May 18, 2023