'ఆర్ఆర్ఆర్' నిర్మాత ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి. ఆయన కుమారుడు కల్యాణ్ పెళ్లి గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ స్టార్స్ తో హాజరై సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ గా మారిపోయాయి.
‘ఆర్ఆర్ఆర్’ పేరు చెప్పగానే అందరికీ డైరెక్టర్ రాజమౌళి, హీరోలు రామ్ చరణ్-ఎన్టీఆర్ గుర్తొస్తారు. కానీ నిర్మాత దానయ్య గురించి ఎవరూ పెద్దగా మాట్లాడుకోరు. ఎందుకంటే ఆయన కూడా చాలావరకు తెరవెనకే ఉంటూ వచ్చారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో మూవీ చేస్తూ బిజీగా ఉన్నారు. అలాంటి దానయ్య ఇంట్లో తాజాగా పెళ్లి సందడి నెలకొంది. టాలీవుడ్ స్టార్స్ చాలామంది ఈ ఈవెంట్ కి విచ్చేసి నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకీ ఎవరి పెళ్లి జరిగింది?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆర్ఆర్ఆర్ నిర్మాత దానయ్య కొడుకు కల్యాణ్ ప్రస్తుతం హీరోగా ‘అధీరా’ అనే సినిమా చేస్తున్నాడు. ‘జాంబీరెడ్డి’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. గతేడాది అఫీషియల్ గా ప్రారంభమైంది. అది అలా ఉండగానే కల్యాణ్ ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు. సమత అనే అమ్మాయితో హైదరాబాద్ లో వీళ్ల పెళ్లి గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రామ్ చరణ్ తోపాటు డైరెక్టర్స్ రాజమౌళి, త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్ తదితరులు హాజరవడం విశేషం. ప్రస్తుతం ఆ ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారిపోయాయి.
Happy Married Life @IamKalyanDasari 💐🎉#DVVDanayya#RamCharan #PrashanthNeel #SSRajamouli pic.twitter.com/MV3U1M9ar7
— Dheeraj Pai (@DheerajPai1) May 20, 2023