సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీల కెరీర్ గురించి తెలియాలంటే వారేదైనా ఇంటర్వ్యూలలో పాల్గొన్నప్పుడు, లేదా ఏదైనా సందర్భంలో షేర్ చేసుకున్నప్పుడే ఎవరితో ఎలాంటి బాండింగ్ ఉంది.. కెరీర్ లో మర్చిపోలేని అనుభవాలు ఏమైనా ఉన్నాయా అనేది తెలుస్తుంది. తెలుగులో నిర్మాతగా శత్రువు, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి బ్లాక్ బస్టర్స్ ఖాతాలో వేసుకున్నారు ఎంఎస్ రాజు. అలాగే దర్శకుడిగా తూనీగ తూనీగ, వాన, డర్టీ హరి లాంటి సినిమాలు చేశారు.
కెరీర్ పరంగా నిర్మాతగా ఫిలిం ఫేర్, నంది అవార్డులను కూడా అందుకున్నారు. ఇక ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘7 డే 6 నైట్స్’ సినిమా జూన్ 24న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో తాజాగా ఎంఎస్ రాజు గారు ఓ ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని ఆయన కెరీర్ గగురించి, కెరీర్ లోని మర్చిపోలేని ఇన్సిడెంట్స్ గురించి షేర్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎంఎస్ రాజు గారు.. ఒక్కడు సినిమా టైంలో హీరోయిన్ భూమికకు సంబంధించిన ఇన్సిడెంట్ షేర్ చేసుకున్నారు.
ఆయన మాట్లాడుతూ.. “ఒక్కడు షూటింగ్ టైంలో రెయిన్ లో ఓ ఛేజింగ్ సీన్ చేస్తున్నాం. అక్కడ ఓ మేకల గుంపు ఒకటి ఉంది. షాట్ గ్యాప్ లో నేను, మహేశ్ బాబు, భూమిక పక్కపక్కన కూర్చున్నాం. అయితే.. ఓ చిన్న మేకపిల్ల గుంపులో నుండి బయటికి దూకి దాని తల్లి దగ్గరికి వెళ్ళబోయింది. అదే టైంలో ఫైట్ మాస్టర్ అసిస్టెంట్ ఒకరు ఆ మేకపిల్లను పట్టుకొని గుంపులోకి విసిరేశాడు. ఇది చూసిన భూమిక ఒక్కసారిగా అతనిపై గట్టిగా అరిచేసింది. ఏం తిట్టిందో తెలియదు. ఇంగ్లీషులో ఏదో తిట్టింది. అదేదో భయంకరంగా ఉంది. ఆమె ఎందుకు తిట్టింది అనేది మాకు తర్వాత అర్థమైంది” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఎంఎస్ రాజు మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.