Manmadhudu: సాధారణంగా ఒక భాషలో హిట్ అయిన సినిమాలు వేరే భాషలో రీమేక్ అవుతుండటం అనేది ఎన్నో ఏళ్లుగా జరుగుతూ వస్తోంది. వాటిలో కొన్ని ఒరిజినల్ సినిమాలకు న్యాయం చేయవచ్చు. మరికొన్ని ఒరిజినల్ సినిమాల తాలూకు మ్యాజిక్ ని చెడగొట్టి నిరాశ పరచవచ్చు. కానీ.. ఒక భాషలో హిట్ అయిన సినిమాను వేరే భాషలో రీమేక్ చేయడమే కాకుండా.. మళ్లీ ఒరిజినల్ భాషలో డబ్ చేసి రిలీజ్ చేయడమనేది చాలా కాలంగా చూస్తున్నాం.
ఆ విధంగా రీమేక్ అయిన సినిమాలను డబ్ చేసి ఒరిజినల్ భాషలో రిలీజ్ చేస్తే.. ప్రేక్షకులు స్వాగతిస్తారని ఎలా అనుకుంటారో ఏమో మేకర్స్. మామూలుగా తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమాలు కన్నడ, తమిళ, హిందీ భాషల్లో రెగ్యులర్ గా రీమేక్ అవుతుంటాయి. అలాంటి తెలుగులో బ్లాక్ బస్టర్ అయ్యి.. కన్నడలో రీమేక్ అయిన సినిమా ‘మన్మథుడు’. నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమా కన్నడ రీమేక్ లో ఉపేంద్ర హీరోగా నటించాడు.
ఉపేంద్ర సరసన దీపికా పదుకోనె హీరోయిన్ గా నటించింది. అయితే.. ‘ఐశ్వర్య’ అనే టైటిల్ తో రీమేక్ అయిన సినిమాను.. మళ్లీ తెలుగులో ‘కంత్రి మొగుడు’ అనే టైటిల్ తో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇక మన ఒరిజినల్ సినిమాలు వేరే భాషలో రీమేక్ అవ్వడం వరకూ ఓకే. కానీ మళ్లీ డబ్ వెర్షన్ రిలీజ్ అయితేనే ‘కర్మరా బాబు’ అనిపిస్తుంది. ఈ రీమేక్ కంత్రి మొగుడు సినిమా చూస్తే.. మన్మథుడు మూవీ ఫ్యాన్స్ అందరికీ అదే ఫీలింగ్ కలుగుతుంది.
ఇక ఈ సినిమాలో ఉపేంద్ర, దీపికా ఇద్దరూ యూరప్ ట్రిప్ కి వెళ్తారు. తెలుగులో బ్రహ్మానందం ‘లవంగం’గా చేసిన క్యారెక్టర్ ని కాయ అని మార్చారు. ఆ పాత్రలో కమెడియన్ సాధుకోకిల నటించారు. ఆ తర్వాత బ్రహ్మానందం షాప్ లో నుండి షూ కొట్టేసి పరిగెత్తే సీన్.. ఈ సినిమాలో రోస్ట్ చేసేశారు. బేసిగ్గా సినిమాలో డైలాగ్స్ తో పాటు ప్రతి సీన్ తెలుగు నుండి అచ్చు దింపేశారు. ఈ సన్నివేశాలపై తెలుగు ప్రేక్షకుల నుండి పెద్ద ఎత్తున విమర్శలు ఎదురయ్యాయి.
తెలుగులో అంత మంచి కామెడీ, డైలాగ్స్ తో బ్లాక్ బస్టర్ అయిన సినిమాను అనవసరంగా రోస్ట్ చేసారని.. మన్మథుడు సినిమాకు, ఐశ్వర్య మూవీకి మధ్య తేడా నక్కకు నాగలోకానికి ఉన్నంత ఉందని ఇప్పటికీ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా హోటల్ లో కాఫీ తాగాక “దే పెయిడ్ నో..” అనే డైలాగ్ తెలుగులో ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలుసు. కానీ.. ఇక్కడికి వచ్చేసరికి సీన్ లో ఉన్న కిక్ అంతా మిస్ అయ్యింది. మన్మథుడు మూవీని ఇలా చేశారేంటని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఐశ్వర్య సినిమా నుండి తెలుగు డబ్బింగ్ సీన్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఈ రీమేక్ సన్నివేశాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
ఇదీ చదవండి: లేడీ ఫ్యాన్ కి ప్రాంక్ కాల్ చేసిన ప్రభాస్ .. వైరల్ వీడియో!