Prabhas: సాధారణంగా సినీతారలు తమ అభిమానులతో సోషల్ మీడియాలో చిట్ చాట్ చేయడం చూస్తుంటాం. కానీ.. ఫ్యాన్స్ తో ఫోన్ కాల్ మాట్లాడటం అనేది రేర్ గా జరుగుతుంది. అయితే.. తమ ఫేవరేట్ హీరో లేదా హీరోయిన్ తో మాట్లాడాలనే కోరిక అందరికీ ఉంటుంది. అన్ని కుదిరితే ఆ అవకాశం నేరుగా కలిసి మాట్లాడటం కావచ్చు లేదా ఫోన్ కాల్ లో అయినా కావచ్చు. కానీ.. ఫేవరేట్ స్టార్ తో కాల్ మాట్లాడినప్పుడు కలిగే ఆ ఆనందం మాత్రం ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. సరిగ్గా కొన్నేళ్ల క్రితం ఓ అమ్మాయికి ఇలాంటి ఆనందమే కలిగింది. తాను ఎంతో అభిమానించే స్టార్ హీరో ఫోన్ కాల్ చేసి మాట్లాడేసరికి.. ఆ అమ్మాయి పట్టలేని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయింది. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు.. ఆ డైహార్డ్ ఫ్యాన్ ఎవరా అనుకుంటున్నారా..? ఆ స్టార్ హీరో ఎవరో కాదు.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. సరిగ్గా 11 సంవత్సరాల క్రితం.. డార్లింగ్ సినిమా చేసి సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా కాజల్ హీరోయిన్ నటించింది. అయితే.. డార్లింగ్ సినిమా విడుదలైన తర్వాత ప్రభాస్ ఓ టీవీ షోలో పాల్గొన్నాడు. ఆ షోలో భాగంగా ప్రభాస్.. హరిత(విజయవాడ) అనే డైహార్డ్ ఫ్యాన్ కి కాల్ చేసి మాట్లాడి ఆమెను సర్ప్రైజ్ చేశాడు. ఇక మొదట్లో నమ్మలేకపోయిన ఆ అమ్మాయి.. ప్రభాస్ పై తనకున్న అభిమానాన్ని బయట పెట్టేసింది. ఇక ఫ్యాన్ తో ప్రభాస్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. ప్రభాస్ చేతిలో పాన్ ఇండియా సినిమాలే లైనప్ చేశాడు. ప్రస్తుతం ఆదిపురుష్ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమా చేయనున్నాడు. మొత్తానికి మరో రెండేళ్ల వరకూ ప్రభాస్ కాల్ షీట్స్ ఖాళీగా లేవని అంటున్నాయి సినీవర్గాలు. మరి ప్రభాస్ ఫ్యాన్ తో మాట్లాడిన వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. ఇదీ చదవండి: ప్రభాస్ అడిగితే ఏ క్యారెక్టర్ అయినా చేస్తాను: గోపిచంద్