మంచు మనోజ్-భూమా మౌనికల వివాహం అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో.. అంగరంగ వైభవంగా జరిగింది. మంచుమోహన్ బాబు దంపతులు దగ్గరుండి కుమారుడి వివాహం జరిపించారు. ఈ సందర్భంగా మోహన్‌బాబుని చూసి మౌనిక ఎమోషనల్ అయ్యింది. ఆ వివరాలు..
వివాహం ప్రతి ఒక్కరి జీవితంలో మరుపురాని మధుర జ్ఞాపకం. తల్లిదండ్రుల సమక్షంలో.. నచ్చిన వాడి చేయి పట్టుకుని ఏడడుగులు నడిచే ఆ క్షణం.. ఆ నూతన దంపతుల మదిలో కలిగే సంతోషాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. మనోజ్‌తో వివాహం సందర్భంగా భూమా మౌనికను చూసిన వారికి ఇదే ఫీలింగ్ కలిగింది. కారణాలేవైనా మొదటి వివాహం ఆ ఇద్దరికి ఓ చేదు అనుభవాన్ని మిగిల్చింది. వారి పరిచయం, ప్రేమ.. ఆ బాధ నుంచి ఇద్దరిని బయటపడేసింది. తామిద్దరం కలిసి ప్రయాణిస్తే.. బాగుటుంది అనుకున్నారు. తమ ప్రేమ గురించి పెద్దలకు చెప్పారు.. వారి అనుమతితో మార్చి 3న వివాహ బంధంలోకి ప్రవేశించారు.
మనోజ్ సోదరి మంచు లక్ష్మి నివాసంలో.. మార్చి 3న అనగా శుక్రవారం రాత్రి 8.30 గంటలకు వారి వివాహం జరిగింది. ఇరు కుటుంబాల నుంచి అతి కొద్ది మంది సభ్యులు మాత్రమే ఈ వివాహానికి హజరయ్యారు. మనోజ్ తల్లిదండ్రులు, సోదరుడి కుటుంబం, అక్క కుటుంబం పెళ్లిలో సందడి చేసింది. అయితే మౌనిక తల్లిదండ్రులు శోభా నాగిరెడ్డి దంపతులు ఇద్దరు కొన్నేళ్ల క్రితం మృతి చెందిన సంగతి తెలిసిందే. మౌనిక తరఫున ఆమె సోదరి కుటుంబం, సోదరుడు హాజరయ్యారు. అయితే బంధువులు ఎందరు ఉన్నా సరే.. తల్లిదండ్రులు లేని లోటును ఎవరూ పూడ్చలేరు. మౌనిక విషయంలో కూడా అదే జరిగింది. ఓ వైపు ప్రేమించిన వాడితో వివాహం జరిగింది అనే సంతోషం.. మరోవైపు తల్లిదండ్రులు లేరనే బాధ ఏకకాలంలో అనుభవించింది.
ఇక మోహన్ బాబు నూతన దంపతులను ఆశీర్వదించడానికి వెళ్లాడు. మామ గారిని చూడగానే తండ్రిని గుర్తు చేసుకున్న మౌనిక.. భావోద్వేగంతో.. ఆయనను పట్టుకుని ఎమోషనల్ అయ్యింది. మోహన్ బాబు కూడా కోడలిని కుమార్తెలా భావించి.. ఓదార్చారు. నిండు నూరేళ్లు చల్లగా ఉండమని ఆశీర్వదించాడు. ప్రస్తతం ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరలవుతోంది. ఇది చూసిన వారు.. తల్లిదండ్రులు లేకపోతేనే.. నీ అత్తమామలే ఇక నీకు తల్లిదండ్రులు.. వారు నిన్ను కుమార్తెలానే ప్రేమగా చూసుకుంటారు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాక.. వివాహం సందర్భంగా మనోజ్-మౌనికలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.