టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా ఏళ్లు అవుతోంది. అప్పుడెప్పుడో 2017లో ఒక్కడు మిగిలాడులో చివరిగా కనిపించాడు మంచు మనోజ్.
టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా ఏళ్లు అవుతోంది. అప్పుడెప్పుడో 2017లో ఒక్కడు మిగిలాడులో చివరిగా కనిపించాడు మంచు మనోజ్. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు. దీనికి తోడు భ్యార్యతో విడాకులు. ఇలా చాలా సమస్యలు వచ్చాయి. కొన్ని రోజులు సినిమాలకు దూరమయ్యాడు. మళ్ళి చాలా రోజుల తర్వాత మేకప్ వెసుకోనున్నాడు. అయితే తాజాగా “వాట్ ది ఫిష్” అనే మూవీని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. వాట్ ది ఫిష్.. మనం మనం బరంపురం అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మంచు మనోజ్. ఇప్పుడవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
లేటెస్ట్ గా మంచు మనోజ్ ట్విట్టర్ లో కెమెరా ముందు నిల్చుని కెమెరాకు దండం పెడుతూ.. ఒక ఫోటో పోస్ట్ చేశారు. ఇప్పుడిది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అలాగే అమ్మలాంటి సినిమా దగ్గరకు మళ్ళి వచ్చాను. లవ్ యూ సినిమా నన్ను ప్రేమిస్తున్నా నా ఫ్యాన్స్ కి థ్యాంక్యూ అంటూ.. ఎమోషనల్ పోస్ట్ చేశారు. దీంతో వాట్ ది ఫిష్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినట్లు తెలుస్తొంది. ఇక ఈ మూవీని వరుణ్ డైరెక్ట్ చేయబోతున్నారు. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ లో మంచు మనోజ్ లుక్ ఆకట్టుకుంటుంది. వాట్ ది ఫిష్ మూవీ పోస్టర్ .. చుట్టూ భయంకరమైన విదేశీ డాన్ లు కనిపిస్తుంటే.. వారినీ ఎదుర్కోవడానికి సిద్దమౌతున్న హీరో పిడికిలి బిగించి బ్యాక్ ఫీట్ లో కనిపిస్తున్నా ఫోటో ఆకట్టుకొంటుంది. ఈ సినిమాను రొటిన్ కి భిన్నంగా చేయబోతున్నారని సమాచారం.
ఇక ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. దినికి ముందు అనేక సినిమాలు చేశాడు కానీ ఏ ఒక్కటి తన కెరీర్ ను నిలబెట్టలేకపోయాయి. అపట్లో వచ్చిన బిందాస్, వేదం తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయాడు మంచు మనోజ్. అయితే వాట్ ది ఫిష్ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి రావాలనుకుంటున్నాడు. ఈ సినిమాతో అయిన మంచు మనోజ్ కెరీర్ నిలబడుతుందా.. లేక ప్లాప్‌లతోనే నెట్టుకొస్తాడా అని తెలియలంటే కొన్ని రోజలు వేచి చూడాలి.
Back to my Amma, CineMA 🙏🏼❤️ Love you all with all my heart ❤️ pic.twitter.com/woQRMveQmK
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) August 21, 2023