సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన ‘సర్కారు వారి పాట’ చిత్రం మే 12న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమాను జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీస్, 14 రల్స్ ప్లస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే సినిమాపై ఫ్యాన్స్ లో అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. ట్రైలర్ లో చూపినట్లుగానే సినిమాలో మహేష్ నుండి సరికొత్త మేనరిజమ్, డైలాగ్ డెలివరీ, యాక్షన్, రొమాన్స్ ఇలా అన్ని కొత్తగా చూడబోతున్నామని ఫ్యాన్స్ అంటున్నారు.
ఇక రిలీజ్ కి ఇంకా కొద్దిగంటల సమయమే ఉండేసరికి చిత్ర యూనిట్ విరామం లేకుండా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. ఈ క్రమంలో సర్కారు వారి ప్రమోషన్లలో భాగంగా మహేష్ బాబు ఇన్ స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించారు. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపికగా నవ్వుతూ బదులిచ్చారు. ఈ చిట్ చాట్ లో మహేష్ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడయ్యాయి. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అని ఓ అభిమాని అడగ్గా.. తన భార్య నమ్రత శిరోద్కర్ పేరు చెప్పారు. నమ్రతలో మీకు బాగా నచ్చిన విషయం ఏంటని వేరొకరు అడిగిన ప్రశ్నకు.. ఆమెలో అన్నీ ఇష్టమే, అందుకే పెళ్లి చేసుకున్నా అని మహేష్ నవ్వుతూ జవాబిచ్చాడు.
మరి సర్కారు వారి పాట సినిమాలోని పెన్నీ సాంగ్ లో మహేష్ కూతురు సితార స్టెప్పులేసిన విషయం విదితమే. ఇక భవిష్యత్తులో వెండితెరపై నటిగా చేసే అవకాశం ఉందా? అని అనే ప్రశ్నకు ‘సితార ఇప్పటికే యాక్టర్ అయ్యిందని నేను అనుకుంటున్నాను’ అని నవ్వేశాడు. మీ కుటుంబంలో స్మార్ట్ పర్సన్ ఎవరు? అని అడిగితే.. వెంటనే సితార పేరు చెప్పేశాడు. అదేవిధంగా బిజీ షెడ్యూల్స్‌లో పిల్లలకు సమయాన్ని ఎలా కేటాయిస్తున్నారు? అని ప్రశ్నించగా.. అది చెప్పలేను కానీ పిల్లలతో మాత్రం తప్పకుండా సమయాన్ని గడపడానికి ఇష్టపడతా అని చెప్పాడు. ప్రస్తుతం మహేష్ ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి మహేష్ బెస్ట్ ఫ్రెండ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.