ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-రష్మిక హీరో హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం పుష్ప. డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతూ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ మూవీ చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. ట్విటర్ వేదికగా.. పుష్పపై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరలవుతోంది.
‘పుష్ప సినిమాలో పుష్పరాజ్ గా అల్లు అర్జున్ నటన స్టన్నింగ్, ఒరిజినల్, సెన్సేషనల్‌గా ఉంది. అత్యద్భుతంగా నటించాడు. తన సినిమాలు ఎంత వాస్తవంగా, పచ్చిగా, నిజాయితీగా ఉంటాయో సుకుమార్ మరోసారి నిరూపించాడు’ అని మహేష్ బాబు ట్వీట్ చేశాడు. అలాగే ‘పుష్ప’కు పని చేసిన టెక్నీషియన్ల గురించి మరో ట్వీట్ చేశాడు మహేష్ బాబు.
.@alluarjun as Pushpa is stunning, original and sensational… a stellar act 👏👏👏 @aryasukku proves again that his cinema is raw, rustic and brutally honest… a class apart 👏👌
— Mahesh Babu (@urstrulyMahesh) January 4, 2022
ఇది కూడా చదవండి : బన్నీ అలా అడిగే సరికి షాక్ అయ్యాను.. పుష్ప తల్లి కల్పలత
‘దేవి శ్రీ ప్రసాద్.. నీ గురించి ఏం చెప్పను. నువ్వో రాక్ స్టార్ వి. మైత్రీ మూవీ మేకర్స్ టీమ్ కు శుభాకాంక్షలు. మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది’ అని ట్వీట్ చేశాడు మహేష్. అయితే హీరో, దర్శకుడు, నిర్మాత, సంగీత దర్శకుడు ఇలా అందర్నీ పేరు పేరునా పొగిడిన మహేష్ బాబు.. హీరోయిన్ ని మాత్రం మార్చిపోయారు. సరిలేరు నీకెవ్వరు సినిమాలో తనతో జోడీ కట్టి.. ఇప్పుడు పుష్ప సినిమాలో శ్రీవల్లిగా మెప్పించిన రష్మిక గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. మరోవైపు మహేష్ బాబు ట్వీట్స్ చూసి హ్యాపీగా ఫీలైన బన్నీ అభిమానులు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్స్ చేశారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
.@ThisIsDSP what can I say.. you’re a rock star!! Congrats to the entire team of @MythriOfficial. Proud of you guys!
— Mahesh Babu (@urstrulyMahesh) January 4, 2022
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు. విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకుంది.
ఇది కూడా చదవండి : పుష్ప సినిమాలోని ఎర్ర చందనం స్మగ్లింగ్ సీన్స్ నిజ జీవితంలో!