కొంత కాలం నుంచి ఇండస్ట్రీలో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ముఖ్యంగా సావిత్రి జీవితంపై తెరకెక్కిన మహానటి మంచి విజయం సాధించడంతో.. మరోసారి బయోపిక్ ప్రయత్నాలు తెర మీదకు వచ్చాయి. ఈ క్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమకు ఇలవేల్పుగా భావించే నందమూరి తారకరామారావు బయోపిక్ రెండు పార్ట్‌లుగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ ఈ బయోపిక్‌లో నటించారు. ప్రస్తుతం పలువురు క్రీడాకారుల బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలో ఒకప్పటి టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్ తెరకెక్కించాలనే ప్రతి పాదన తెర మీదకు వచ్చింది. దీనిపై మహేష్ బాబు మహేష్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహేష్ బాబు నిర్మాతగా ఆయన ప్రొడక్షన్ హౌజ్‌లో తెరకెక్కిన మేజర్ సినిమా ట్రైలర్ విడుదల సదర్భంగా.. కృష్ణ బయోపిక్ పై మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వివరాలు..
26/11 ముంబై ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా మేజర్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రను అడివి శేష్ పోషిస్తున్నాడు. ‘గూఢచారి’ ఫేమ్ శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అడివి శేష్ సరసన సయీ మంజ్రేకర్ నటించగా… కీలక పాత్రలో శోభితా దూళిపాళ్ల నటించింది. జూన్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఎంతో ఎమోషనల్ గా సాగిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో చిత్రబృందంతో పాటు మహేష్ బాబు కూడా పాల్గొన్నారు. ఈ ఈవెంట్ కి తెలుగు మీడియాతో పాటు బాలీవుడ్ మీడియా కూడా ఎటెండ్ అయింది. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు మహేష్ బాబు. ‘మేజర్’ సినిమా తీయడం ఎంతో గర్వంగా ఉందని.. ఈ సినిమా చూశానని అద్భుతంగా వచ్చిందని అన్నారు. ముఖ్యంగా లాస్ట్ 30 నిమిషాల సినిమా చూసి గొంతు తడారిపోయిందని వెల్లడించారు.
ఈ క్రమంలో ఓ విలేకరి.. మహేష్ బాబును ఉద్దేశించి.. మీ తండ్రి కృష్ణ బయోపిక్ ను ఎప్పుడు తీస్తారని ప్రశ్నించగా.. ‘నాన్నగారి బయోపిక్ ఎవరైనా చేస్తే నేను ఆనందంగా చూస్తాను. నేనైతే చేయలేను. ఆయన నా దేవుడు. ఎవరైనా బయోపిక్ డైరెక్ట్ చేయడానికి ముందుకొస్తే ప్రొడ్యూస్ చేయడానికి నేను రెడీ’ అంటూ చెప్పుకొచ్చారు. అంటే కృష్ణ బయోపిక్ లో నటించే ఉద్దేశం మహేష్ బాబుకి లేదన్నమాట. మొత్తానికి తన తండ్రి బయోపిక్ పై క్లారిటీ ఇచ్చేశారు మహేష్ బాబు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి.