ప్రభాస్, కృతిసనన్ ల మధ్య గత కొంతకాలంగా రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై కృతి సనన్ స్పందించింది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ ల మధ్య లవ్ ఎపిసోడ్ నడుస్తోందని గత కొన్ని రోజులుగా పుకార్లు వస్తున్నాయి. ఈ ఇద్దరూ ఆదిపురుష్ సినిమాలో ఎప్పుడైతే నటించడం మొదలుపెట్టారో అప్పటి నుంచి ఈ జంటపై అనేక రూమర్లు వచ్చాయి. ఈ ఇద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. దీనికి బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ఆద్యం పోస్తూ కృతి మనసులో ఒక హీరో ఉన్నాడు అంటూ హింట్ ఇచ్చాడు. దీంతో ప్రభాస్, కృతి సనన్ ల మధ్య లవ్ ఎఫైర్ నిజమే అని చాలామంది ఫిక్స్ అయిపోయారు. త్వరలోనే నిశ్చితార్థం చేసుకుంటారని కూడా రూమర్లు వ్యాప్తి చేశారు.
అయితే తొలిసారిగా ఈ రూమర్లపై కృతి సనన్ స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో భాగంగా డేటింగ్ రూమర్లపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అసలు ఈ రూమర్లు రావడానికి కారణం వరుణ్ ధావన్ అని ఆమె చెప్పింది. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న వరుణ్ ధావన్ కి బోర్ కొట్టిందట. అప్పుడు వరుణ్.. ఒక రూమర్ ని పుట్టిస్తా అని కృతి సనన్ తో అన్నాడట. కృతి సనన్ మనసులో ఒక హీరో ఉన్నాడు అనే రూమర్ ని పుట్టిస్తా అని అనడంతో దానికి సరే అని అన్నదట కృతి సనన్. అయితే ఈ రూమర్ లోకి ప్రభాస్ ని లాగుతాడని తాను అస్సలు ఊహించలేదని ఆమె వెల్లడించింది. ఐతే వరుణ్ ధావన్ వల్ల ప్రభాస్ తో తన డేటింగ్ అనేది దేశమంతా లావాలా పాకింది.
అయితే ఈ విషయం ప్రభాస్ కి కాల్ చేసి అసలు ఏం జరిగిందో చెప్పాలనుకున్నానని, ప్రభాస్ కి కాల్ చేస్తే.. ఎందుకు వరుణ్ మన గురించి అలా అన్నాడు’ అంటూ అడిగారట. అప్పుడు కృతి సనన్ తనకు తెలియదని చెప్పిందట. ఈ విషయాన్ని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. తనకు అందరూ అభినందనలు చెబుతూ మెసేజులు పంపుతున్నారని.. ఈ మేటర్ కి ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతో స్పందించాల్సి వస్తుందని ఆమె వెల్లడించింది. అయితే కృతి సనన్ కావాలనే ప్రభాస్ పేరుని వాడుకుంది అంటూ కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు వరుణ్ ధావన్ తీరుపై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ప్రభాస్ పేరుని ఎందుకు మధ్యలోకి లాగారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రభాస్ విషయంలో కృతి సనన్, వరుణ్ ధావన్ చేసిన పనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.