జబర్దస్త్ షో ద్వారా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న కమెడియన్స్ లో కిరాక్ ఆర్పీ ఒకరు. జబర్దస్త్ లో ఉన్నన్నాళ్ళు తనదైన శైలిలో పంచులు, కామెడీ స్కిట్స్ తో ప్రేక్షకులను అలరించిన ఆర్పీ.. కొన్నాళ్లుగా టీవీ షోస్ కి దూరంగా ఉంటూ బిజినెస్ లో రాణిస్తున్నాడు. హైదరాబాద్ లో 'నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు' బిజినెస్ ప్రారంభించిన ఆర్పీ.. కొన్ని నెలల్లోనే మరో రెండు బ్రాంచిలను ఓపెన్ చేసి వార్తలలో నిలిచాడు. తాజాగా ప్రేమించిన అమ్మాయి లక్ష్మీప్రసన్నతో పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
జబర్దస్త్ షో ద్వారా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న కమెడియన్స్ లో కిరాక్ ఆర్పీ ఒకరు. జబర్దస్త్ లో ఉన్నన్నాళ్ళు తనదైన శైలిలో పంచులు, కామెడీ స్కిట్స్ తో ప్రేక్షకులను అలరించిన ఆర్పీ.. కొన్నాళ్లుగా టీవీ షోస్ కి దూరంగా ఉంటూ బిజినెస్ లో రాణిస్తున్నాడు. టీవీ షోలకు దూరమయ్యాక కొంతకాలం మీడియాలో యాక్టీవ్ గా కనిపించని ఆర్పీ.. హైదరాబాద్ లో ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ బిజినెస్ ప్రారంభించి.. ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతేగాక సెలబ్రిటీలతో తన చేపల పులుసును ప్రమోట్ చేసుకొని.. కొన్ని నెలల్లోనే మరో రెండు బ్రాంచిలను ఓపెన్ చేసి వార్తలలో నిలిచాడు.
ఇక రీసెంట్ గా అమీర్ పేట్ లో తన చేపల పులుసు మూడో బ్రాంచ్ ఓపెన్ చేసిన ఆర్పీ.. తాను ప్రేమించిన అమ్మాయి లక్ష్మీప్రసన్నతో పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతేడాది మే నెలలో ఆర్పీకి లక్ష్మీ ప్రసన్నతో గ్రాండ్ గా నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత పెళ్లి ఎప్పుడు అనౌన్స్ చేస్తారనే సందేహం అందరిలోనూ కలిగింది. దీంతో ఈ విషయంపై తాజాగా క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కిరాక్ ఆర్పీ మాట్లాడుతూ.. ‘నాకు అబద్దాలు చెప్పడం రాదు. ఆమె వెంట రెండేండ్లు పిచ్చికుక్కలా తిరిగాను. మొత్తానికి వాళ్ల తల్లిదండ్రులు మా పెళ్లికి ఒప్పుకున్నారు. ఈ ఏడాది నవంబర్ 29న పెళ్లి చేసుకోబోతున్నాం’ అని చెప్పుకొచ్చాడు.
ఈ క్రమంలో ఆర్పీ ప్రేమించిన అమ్మాయి లక్ష్మీప్రసన్న మరోసారి తమ లవ్ స్టోరీని రివీల్ చేసింది. ఆమె మమాట్లాడుతూ.. ‘ఆర్సీ రెడ్డి కోచింగ్ సెంటర్ లో ఉన్నప్పుడు కిరాక్ ఆర్పీ గెస్ట్ గా వచ్చారు. అక్కడే మా ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత మా అమ్మ నెంబర్ తీసుకొని.. ముందు మా ఫ్యామిలీకి, బంధువులకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత మా పేరెంట్స్ తో మాట్లాడి పెళ్లికి ఒప్పించాడు. ఇప్పుడైతే అంతా హ్యాపీ’ అని చెప్పుకొచ్చింది. మొత్తానికి వీరిద్దరూ ఈ ఏడాది వివాహ బంధంలో అడుగు పెట్టబోతున్నారని తెలిసి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇక మొదట కేపీహెచ్ బీలో నెల్లూరు చేపల పులుసును స్టార్ట్ చేసిన ఆర్పీ.. రెండో బ్రాంచ్ ని మణికొండలో.. మూడోది అమీర్ పేట్ లో ఓపెన్ చేశాడు. వ్యాపారంలో రాణిస్తున్న ఆర్పీ, త్వరలోనే ఇంటివాడు కాబోతున్నాడు. మరి ఆర్పీ బిజినెస్ గురించి, తన లవ్ స్టోరీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.