జబర్దస్త్ కామెడీ షో ద్వారా వెలుగులోకి వచ్చిన కమెడియన్స్ లో కిరాక్ ఆర్పీ అలియాస్ రాంప్రసాద్ ఒకరు. రాయలసీమ యాసలో తనదైన కామెడీని పండించి క్రేజ్ తెచ్చుకున్న ఆర్పీ.. కొన్నేళ్ల క్రితమే జబర్దస్త్ ని వీడి ప్రస్తుతం ‘కామెడీ స్టార్స్’ షోలో స్కిట్స్ చేస్తున్నాడు. అయితే.. పర్సనల్ లైఫ్ కి సంబంధించి ఎక్కువగా బయటపెట్టని ఆర్పీ.. ఇటీవలే తాను ప్రేమించిన అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఆర్పీ ఎంగేజ్మెంట్ వేడుకకు జబర్దస్త్ కమెడియన్స్ తో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు.
ఇక కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న కిరాక్ ఆర్పీ ఒక్కసారిగా ఎంగేజ్మెంట్ చేసుకొని సర్ప్రైజ్ చేయడంతో వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆర్పీ నిశ్చితార్థానికి జబర్ధస్త్ నటులతో పాటు సినీ తారలు నాగబాబు, శివాజీ, కృష్ణభవాన్, అన్నపూర్ణ, హేమ తదితరులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునే ఆర్బీ.. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటాడు.ఇదిలా ఉండగా.. కిరాక్ ఆర్పీ ఎంగేజ్మెంట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ కాగా.. ఆర్పీని లవ్ చేసి.. పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఎవరు? ఆమె వివరాలు ఏంటనే ఆసక్తి అందరిలో నెలకొంది. అప్పటినుండి కిరాక్ ఆర్పీకి కాబోయే అమ్మాయి ఎవరంటూ గూగుల్ లో కూడా వెతుకున్నారు. అయితే.. కిరాక్ ఆర్పీని ప్రేమించి పెళ్లాడనున్న అమ్మాయి పేరు లక్ష్మిప్రసన్న. నెల్లూరు జిల్లాకు చెందిన లక్ష్మి.. ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆర్పీ హైదరాబాద్ కు వచ్చి సినీ, టీవీ అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు లక్ష్మీప్రసన్ననే తోడుగా నిలిచిందని ఒకానొక సందర్భంలో చెప్పాడు. అప్పటినుండి తనకు సపోర్టుగా నిలిచిన లక్ష్మినే వివాహం చేసుకోబోతున్నాడు. ఇన్నాళ్లపాటు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని వెయిట్ చేసిన ఆర్పీ.. ఇటీవలే పెద్దలను ఒప్పించి మరీ నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇక ఓవైపు కామెడీ షోలో స్కిట్స్ చేస్తూనే ఆర్పీ.. త్వరలోనే దర్శకుడిగా డెబ్యూ చేయనుండటం విశేషం. మరి ప్రస్తుతం వైరల్ అవుతున్న కిరాక్ ఆర్పీ – లక్ష్మి ప్రసన్న జంటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.