సౌత్ సినీ ఇండస్ట్రీ నుండి బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్న పాన్ ఇండియా సినిమాలలో ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ ఒకటి. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధం అవుతోంది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన ఈ ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ మూవీపై ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులలో అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. అయితే.. కేజీఎఫ్ చాప్టర్ 1 విడుదలైన 4 ఏళ్లకు కేజీఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ అవుతోంది.
ఈ క్రమంలో కేజీఎఫ్ చాప్టర్ 1 కి సంబంధించి ఓ క్రేజీ విషయాన్ని బయటపెట్టింది చిత్రబృందం. కేజీఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ కి వారం రోజుల ముందు.. ఏప్రిల్ 8 నుండి ఏప్రిల్ 13 వరకు చాప్టర్ 1 ని మళ్లీ దేశవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అంటే.. చాప్టర్ 2కి ముందునుండే కేజీఎఫ్ సందడి బాక్సాఫీస్ వద్ద మొదలు కాబోతుంది. అదీగాక.. చాప్టర్ 2 చూసేముందు ఓసారి చాప్టర్ 1 చూస్తే పూర్తిగా అర్థం చేసుకోగలుగుతారని చిత్రబృందం భావించినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి.ఇక కేజీఎఫ్ చాప్టర్ 1 మూవీని థియేటర్ లో మిస్ అయినవారి కోసం కూడా మళ్లీ రిలీజ్ చేస్తున్నారేమో అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ తదితర ప్రముఖులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే కేజీఎఫ్ 2 సాంగ్స్, ట్రైలర్ ట్రెండ్ అవుతున్నాయి. మరి మాసివ్ కేజీఎఫ్ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#KGFChapter1 will play in select screens from April8-13 across the country at subsidised rates. Go relive Rocky bhai entering Narachi and gear up to watch what he does next.
— Karthik Gowda (@Karthik1423) March 31, 2022