ప్రముఖ నిర్మాత దిల్ రాజు సినిమాకు సంబంధించి ఏ న్యూస్ చెప్పిన చాలా ప్రత్యేకంగా, ఆసక్తికరంగా ఉంటుంది. తాజాగా ముగ్గురు స్టార్ హీరోల అభిమానులకు సంతోష పడే న్యూస్ ఒకటి చెప్పారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
దిల్ రాజు.. ఈ వ్యక్తి గురించి టాలీవుడ్ ప్రేక్షకులనకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నిర్మాతలకు కూడా అభిమానులు ఉంటారు అనే స్థాయిలో ఉన్న వ్యక్తి దిల్ రాజు. ఆయన సినిమా అంటే చాలు హీరోను, దర్శకుడిని చూడకుండా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడతారు. అంతలా సినీ ఇండస్ట్రీలో ఓ బ్రాండ్ క్రియేట్ చేశాడు. ఎంతో మంది నూతన దర్శకులను పరిచయం చేసిన ఘనత దిల్ రాజుకే దక్కుతుంది. అయితే ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలతో రాజుగారు ఫుల్ బిజిగా ఉన్నారు. ఇదే సమయంలో ప్రభాస్, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్ అభిమానులకు దిల్ రాజు ఓ గుడ్ న్యూస్ చెప్పారు.
ప్రస్తుతం పలు సినిమాల నిర్మాణంలో దిల్ రాజు బిజిబీజీగా ఉన్నారు. అయితే ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరొకవైపు కొత్త సినిమాల నిర్మాణ పనులో ఉన్నారు. అందులో ప్రభాస్, ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ మూవీలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ‘సలార్’ మూవీ వస్తుంది. అలానే కోరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా రానుంది. సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో మూవీ చేయనున్నారు. ఈ సినిమాల్లో తమ హీరోలు ఏ రేంజ్ లో ఉంటారా? అని అభిమానులు తెగ ఎగ్జైటింగ్ గా ఉన్నారు.
ఇలాంటి సమయంలో నిర్మాత దిల్ రాజు మరో ఫెంటాస్టిక్ న్యూస్ చెప్పారు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో మరో సినిమా కూడా వస్తుందని, అది కూడా పౌరాణికమని ప్రకటించారు. అలానే జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రొడక్షన్ కూడా ఫైనలైందని ఆయన తెలిపారు. అలానే పవన్ కల్యాణ్ తో ఓ సినిమా చేయనున్నట్లు దిల్ రాజు తెలిపారు. పవన్ కల్యాణ్ కూడా సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు దిల్ రాజు అన్నారు. ప్రస్తుతం ఈ సినిమాల పనులు జరుగుతున్నాయని తెలిపారు.
బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. అప్పటి నుంచి ఆయనతో సినిమా చేయాలని దిల్ రాజు ప్రయత్నిస్తున్నారు కానీ.. సెట్ కాలేదు. ఇప్పుడు అంతా సెట్ అయ్యింది. ఇలా ఒక్కేసారి ముగ్గురు స్టార్ హీరోల సినిమాలతో దిల్ రాజు సినిమా చేయడం సినీప్రియుల్లో ఆసక్తిని కలిగిస్తుంది. అలానే ఈ స్టార్ హీరోల అభిమానులు కూడా ఆనందంలో మునిగి తేలుతున్నారు. మరి… ఈ క్రేజీ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#DilRaju pic.twitter.com/h403D7gPfz
— Aakashavaani (@TheAakashavaani) April 30, 2023