ఎప్పటిలానే ఈ వారం ప్రేక్షకుల ముందుకు రావడానికి కొత్త సినిమాలు షెడ్యూల్ చేసుకుంటున్నాయి. ఒకే ఒక్క పెద్ద మాత్రమే బరిలోకి దిగుతుండగా.. మరికొన్ని చిన్న చిత్రాలు కూడా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి.
ఎప్పటిలానే ఈ వారం ప్రేక్షకుల ముందుకు రావడానికి కొత్త సినిమాలు షెడ్యూల్ చేసుకుంటున్నాయి. ఒకే ఒక్క పెద్ద మాత్రమే బరిలోకి దిగుతుండగా.. మరికొన్ని చిన్న చిత్రాలు కూడా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. గతవారం ఏకంగా 11 సినిమాలు విడుదలయ్యాయి. రెండో వారంలోనూ ‘బేబి’ బాక్సాఫీస్ బరిలో సత్తా చాటుతోంది. ఇక ‘సామజవరగమన’ నాలుగో వారంలోకి ఎంటరై ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబడుతుంది. ‘హిడింబ’ మూవీకి పాజిటివ్ టాక్, మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ కి మంచి రివ్యూలు వచ్చాయి. విజయ్ ఆంటోని ‘హత్య’ నిరాశ పరిచింది. ఈ వారం థియేటర్లలో సందడి చెయ్యబోయే చిత్రాల వివరాలు ఇలా ఉన్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన క్రేజీ ఫిలిం.. ‘బ్రో’ (ది అవతార్). యాక్టర్ కమ్ డైరెక్టర్ పి.సముద్రఖని దర్శకుడు. త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ ఇచ్చారు. జీ5 సంస్థతో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్. జూలై 28న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఇప్పటికే ఓవర్సీస్ ప్రింట్స్ వెళ్లిపోయాయి. సాంగ్స్, టీజర్, ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచేశాయి. పవన్ – తేజ్ తొలిసారి కలిసి నటించడంతో.. మెగాభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ ‘బ్రో’ మూవీపై పాజిటివ్ బజ్ నెలకొంది.
నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా.. ఏఆర్ శ్రీధర్ దర్శకత్వంలో తెరకెక్కిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘స్లమ్ డాగ్ హస్బండ్’. కొడుకు సినిమాను బ్రహ్మాజీ దగ్గరుండి ప్రమోట్ చేస్తున్నాడు. ప్రోమోస్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ శనివారం (జూలై 29) థియేటర్లలోకి రాబోతోంది.
రణ్వీర్ సింగ్, అలియా భట్ హీరో, హీరోయిన్లుగా.. కరణ్ జోహార్ తెరకెక్కించిన చిత్రం ‘రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ’. ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా అజ్మీ కీలక పాత్రల్లో నటించారు. రాకీ, రాణీల ప్రేమకథ ఎలా ఉండబోతుందంటూ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. జూలై 28న సినిమా థియేటర్లలోకి రానుంది.
ఆదిత్య, రేఖ అనే కొత్త తారలు నాయకా, నాయికలుగా పరిచయమవుతున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘ఒక్కరోజు 48 అవర్స్’. నిరంజన్ బండి దర్శకుడు. దీనిలో టైమ్ ట్రావెలింగ్‌కి సంబంధించిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయని ట్రైలర్లో చూపించారు. జూలై 29న మూవీ ఆడియన్స్ ముందుకు రానుంది.
ఇది కూడా చదవండి : ఈ వారం OTTలో సందడి చేయబోయే 17 సినిమాలు ఇవే..