ఎన్టీఆర్ 'దేవర' టీమ్ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తోంది. ఎందుకంటే 'కేజీఎఫ్' ఫేమ్ ఓ నటుడిని ఇప్పుడు కీలకపాత్ర కోసం తీసుకున్నారు. దీంతో ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ఇంతకీ ఏంటి సంగతి?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న కొత్త మూవీ ‘దేవర’. ఫుల్ ఆన్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా రేంజులో తీస్తున్నారు కాబట్టి.. ఖర్చు, క్యాస్టింగ్ విషయంలో ఏ మాత్రం వెనుకాడట్లేదు. పెద్ద పెద్ద స్టార్స్ ని ఇతర ఇండస్ట్రీల్లో గుర్తింపు తెచ్చుకున్న నటీనటుల్ని సినిమాలో పెట్టుకుంటున్నారు. ఇప్పుడు అలానే కేజీఎఫ్ నటుడిని కూడా ‘దేవర’ కోసం తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ న్యూస్ కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ ఏటి విషయం? ఎవరా యాక్టర్?
అసలు విషయానికొచ్చేస్తే.. ‘ఆర్ఆర్ఆర్’ కోసం దాదాపు నాలుగేళ్లు ఇచ్చేసిన ఎన్టీఆర్, రిలీజ్ తర్వాత కూడా ఆ సినిమాని ప్రమోట్ చేస్తూ కనిపించాడు. కొన్నాళ్ల ముందు ఆస్కార్ కూడా ఈ సినిమా అందుకుంది. దీంతో తారక్ కొత్త మూవీ పనుల్లో బిజీ అయిపోయాడు. కొరటాల శివ తీస్తున్న ‘దేవర’లో నటిస్తున్నాడు. ఈ మధ్య తారక్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. సముద్రం ఒడ్డున చేతిలో కత్తితో పవర్ ఫుల్ మాస్ అవతార్ లో కనిపించాడు. అంచనాల్ని అమాంతం పెంచేశాడు.
‘దేవర’లో ఎన్టీఆర్ కి హీరోయిన్ గా జాన్వీ కపూర్ యాక్ట్ చేస్తోంది. సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పుడు విలన్ గ్యాంగ్ లోని కీలక పాత్ర కోసం కేజీఎఫ్ ఫేమ్ తారక్ పొన్నప్పని తీసుకున్నారు. రీసెంట్ గా షూటింగ్ కి అటెండ్ అయ్యాడు. త్వరలో జరగబోయే కొత్త షెడ్యూల్ లోనూ అతడు పాల్గొనబోతున్నాడని తెలుస్తోంది. తెలుగులో ‘సీఐ సనాతన్’ అనే మూవీలోనూ పొన్నప్ప నటించాడు. ‘దేవర’ టీమ్ ప్లానింగ్ చూస్తుంటే.. పలు భాషల్లో పేరున్న నటీనటుల్ని సినిమాలో పెట్టుకుంటున్నారు. బాక్సాఫీస్ ని బద్దలుకొట్టే పెద్ద ప్లాన్స్ వేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ మూవీ థియేటర్లలోకి రానుందని ఇదివరకే అనౌన్స్ చేశారు. మరి ‘దేవర’ ఎలా ఉండబోతుందని మీరనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.
KGF Fame 𝐓𝐚𝐫𝐚𝐤 𝐏𝐨𝐧𝐧𝐚𝐩𝐩𝐚 is playing an Important role in @tarak9999‘s #Devara 💥💥. #ManOfMassesNTR#NTR30 #TarakPonnappa #NTRKoratalaSiva2 pic.twitter.com/GLr4RRJsZX
— Sai Mohan ‘NTR’ (@Sai_Mohan_999) May 27, 2023