ప్రస్తుతం ఇండియన్ సినిమా సౌత్ మూవీలు ఏలుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో ముఖ్యంగా తెలుగు సినిమాలు సత్తా చాటుతున్నాయి. ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లో సైతం కాసుల వర్షం కురిపిస్తున్నాయి. స్ట్రైట్ హిందీ సినిమాలకు కూడా సాధ్యంకాని రికార్డులను సౌత్ సినిమాలు క్రియేట్ చేయడం అక్కడి వారికి కాస్త కంటగింపుగానే ఉంటోంది. పైకి తెలుగు సినిమాని పొగుడుతున్నప్పటికీ లోలోపల మాత్రం వారి స్థానాన్ని లాగేసుకున్నామనే ఈర్ష్య మాత్రం కనిపిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం అయితే టాలీవుడ్– బాలీవుడ్ ఇండస్ట్రీల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉందనే చెప్పాలి. కొందరు తారలైతే బాహటంగానే రీజనల్ ల్యాంగ్వేజెస్ సినిమాలపై కామెంట్ చేయడం చూశాం. వాటికి సౌత్ నుంచి కూడా కౌంటర్ అటాక్స్ ఇచ్చారు.
ఇదీ చదవండి: నాకు అందుకే పెళ్లి కాలేదు.. వైరల్ అవుతున్న కంగనా రనౌత్ కామెంట్స్!
ఇటీవల కాలంలో బాలీవుడ్- సౌత్ ఇండస్ట్రీల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. తెలుగులాంటి రీజనల్ భాషల్లో నేను నటించను అని జాన్ అబ్రహం చెప్పడం, పాన్ ఇండియా అనే కాన్సెప్ట్ ను నేను నమ్మను అని అభిషేక్ బచ్చన్ కామెంట్, కిచ్చ సుదీప్ ట్వీట్ పై స్పందిస్తూ మరి హిందీ భాషలో సినిమాలు ఎందుకు తీస్తున్నారు అని ప్రశ్నించడం అన్నీ చూస్తేనే చెప్పొచ్చు రెండు ఇండస్ట్రీల మధ్య ప్రచ్ఛన్న యుద్ధమే జరుగుతోందని. ఇప్పుడు ఆ వివాదాలపై కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ స్పందించింది. ఓ ప్రెస్ మీట్ లో కంగనా రనౌత్ ను హిందీ భాషలో కిచ్చ సుదీప్ కామెంట్స్, నేను హిందీ సినిమాల్లో నటించను అని కన్నడ స్టార్ యశ్ చెప్పడం, బాలీవుడ్ నన్ను అఫోర్డ్ చేయలేదని మహేశ్ చెప్పడాన్ని ఏ విధంగా చూస్తారంటూ మీడియా కంగనా రనౌత్ ను ప్రశ్నించగా.. ఆమె తనదైనశైలిలో స్పందించింది.
Translation & interpretations are perspectives sir. Tats the reason not reacting wothout knowing the complete matter,,,matters.:)
I don’t blame you @ajaydevgn sir. Perhaps it would have been a happy moment if i had received a tweet from u for a creative reason.
Luv&Regards❤️ https://t.co/lRWfTYfFQi— Kichcha Sudeepa (@KicchaSudeep) April 27, 2022
కంగనా రనౌత్ తన వ్యాఖ్యల్లో మహేశ్, కిచ్చ సుదీప్ లను బాహాటంగానే సమర్థించింది. ‘మహేశ్ బాబు ఒక సూపర్ స్టార్ అని అందరికీ తెలుసు.. కాదు అని ఎవరూ అనలేరు కూడా. అవును నిజంగానే మహేశ్ బాబుని బాలీవుడ్ అఫోర్డ్ చేయలేదు నేను సమర్థిస్తాను. అతను ఒక సూపర్ స్టార్ గా కొన్నేళ్ల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. బాలీవుడ్ నుంచి ఆయనకు సినిమా ఆఫర్స్ వెళ్లడం, అందుకు ఆయన నో చెప్పడం నాకు కూడా తెలుసు. అయినా ఇలాంటి చిన్న చిన్న విషయాలను కాంట్రవర్సీలు చేయకండి. భాష విషయంలో ఎవరి మదర్ టంగ్ అంటే వాళ్లకి గౌరవం ఉంటుంది. నేను మహారాష్ట్ర వెళ్తే మరాఠీ నేర్చుకోవాల్సిందే. ఎవరైనా ఢిల్లీ వస్తే తప్పకుండా హిందీ నేర్చుకోవాలి. అనవసరంగా ఇలాంటి వాటిని పెద్దవి చేయకండి’ అంటూ కంగనా రనౌత్ వ్యాఖ్యానించింది. కంగనా రనౌత్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.