RRR.. మరోసారి తెలుగు సినిమాను జాతీయ స్థాయిలో నిలిపిన చిత్రం. బాహుబలి తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం బక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. మార్చి 25న విడుదలైన ఈ పాన్ ఇండియా మూవీ 5 రోజుల్లోనే రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఎక్కడ చూసిన RRR మానియానే కనిపిస్తోంది. ఇద్దరు స్టార్ హీరోలను తీసుకుని జక్కన్న సాహసం చేసాడనే చెప్పవచ్చు. అయితే వారి అభిమానులను ఏమాత్రం నిరాశ పర్చకుండా.. ఇద్దరు హీరోలకు సమ ప్రాధాన్యం ఇచ్చి.. సినిమాను విజయ తీరాలకు చేర్చడంలో రాజమౌళి సక్సెస్ అయ్యాడు. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌పై ప్రేక్షకుల నుంచి సినీ సెలబ్రెటీలు వరకు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ సినిమా హిందీలో సైతం రూ. 100 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది.
ఇది కూడా చదవండి: పాన్ వరల్డ్ గా మహేష్-రాజమౌళి మూవీ! బహుబలి, RRR లను మించి!
ఈ మూవీ చూసిన బాలీవుడ్ నటీనటులు, సినీ ప్రముఖులు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లను పొగడ్తలతో ముంచేత్తుతున్నారు. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్ మూవీ, జక్కన్నపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాజమౌళి ఫొటోను షేర్ చేస్తూ ఆయనపై ప్రశంసలు కురిపించింది. ‘ఎప్పటికీ రాజమౌళి సార్ భారతీయ చలచిత్రాల గొప్ప దర్శకుడని మరోసారి నిరూపించుకున్నారు. ఆయన కెరీర్‌లోనే ఇప్పటివరకు ఒక్క ప్లాప్ సినిమా లేదు.. ఇక భవిష్యత్తులో కూడా ఉండదు’ అని తెలిపింది.
ఇది కూడా చదవండి: డబ్బు కంటే ఎక్కువగా శత్రువులను సంపాదించా.. కంగనా కామెంట్స్
అలాగే మరో పోస్ట్‌లో ‘ఇక్కడ ఆయన గురించి చెప్పుకునే మరో విషయం ఏమిటంటే. రాజమౌళి గారు ఒక సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మాత్రమే కాదు.. మానవత్వం ఉన్న గొప్ప మనిషి. దేశంపై, నమ్ముకున్న ధర్మంపై ఆయన చూపించే ప్రేమ గొప్పది. మీలాంటి రోల్ మోడల్ ఉండటం అదృష్టం సార్. నిజాయితిగా నేను మీకు పెద్ద అభిమానిని’ అంటూ కంగనా రాసుకొచ్చింది. అంతేకాదు రేపు కుటుంబంతో కలిసి ఆర్‌ఆర్‌ఆర్ మూవీకి వెళ్తున్నానని, మరి మీరేప్పుడు చూస్తారు? అని మరో స్టోరీలో రాసుకొచ్చింది. ప్రస్తుతం కంగన పోస్ట నెట్టింట వైరల్‌గా మారింది. వివాదాలకు కేరాఫ్‌గా ఉండే కంగన.. రాజమౌళిపై ప్రశంసలు కురిపించడం అంటే గ్రేట్ అంటున్నారు అభిమానులు. మరి కంగన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: సింహాద్రి సినిమా నా కెరీర్‌ను నాశనం చేసింది: Jr Ntr
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.