రాజమౌళి రేంజ్ వేరు. ఇండియాలోనే టాప్ దర్శకులలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి ఆయన మేమ్ ఫేమస్ అనే సినిమా గురించి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఇప్పుడు నెటిజన్స్ కి నచ్చడం లేదు.
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా చూడని దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ప్రపంచ స్థాయిలో ఒక ప్రభంజనం సృష్టించింది.
బాలీవుడ్ అగ్ర నాయికల్లో ప్రియాంక చోప్రా ఒకరు. తన అందం అభినయంతో ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. 2000 సంత్సరంలో ప్రపంచ సుందరిగా కిరీటం దక్కించుకున్నారు. ఆ తరువాత బాలీవుడ్ లో చాలా సినిమాలు చేశారు. ఇటీవల ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేసింది.
2017 ఏప్రిల్ 28న బాహుబలి 2 సినిమా విడుదలైంది. ఇదే రోజున అంటే 2023 28న పీఎస్ 2 విడుదలైంది. దీంతో బాహుబలి 2 కన్నా పీఎస్ 2 బాగుందని కొంతమంది అరవ ఫ్యాన్స్ ట్విట్టర్ లో పడి ఓ తెగ అరుస్తున్నారు. బాహుబలి వరస్ట్ మూవీ అని మొరుగుతున్నారు. మనోళ్లు ఊరుకుంటారా? పొన్నియన్ సెల్వన్ కాదు, పన్నీర్ సెల్వన్ అని కౌంటర్ ఇస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు గెలిచిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్.. తన నివాసంలో టాలీవుడ్ సెలబ్రిటీలకు గ్రాండ్ డిన్నర్ పార్టీ ఇచ్చాడు. రాజమౌళి సహా ప్రముఖ టాలీవుడ్ దర్శక, నిర్మాతలంతా ఈ పార్టీకి హజరయ్యారు. కానీ రామ్ చరణ్ మాత్రం రాలేదు. దీనిపై నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ వివరాలు..
ఎన్టీఆర్.. టాలీవుడ్ ప్రముఖులకు గ్రాండ్ గా పార్టీ ఇచ్చాడు. ఇందులో రాజమౌళి, త్రివికమ్ లాంటి స్టార్ డైరెక్టర్ పాల్గొనడం కాదు.. ఓ హాలీవుడ్ పర్సన్ కనిపించడం ఆసక్తి కలిగిస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు-SS రాజమౌళిల కాంబినేషన్ లో పాన్ వరల్డ్ మూవీగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు పాత్రకు ఓ దేవుడుని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడు జక్కన్న. మరి ఆ దేవుడు ఎవరో ఇప్పుడు చూద్దాం.
సూపర్ స్టార్ మహేష్ తో చేయబోయే కొత్త సినిమా కోసం రాజమౌళి మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు కనిపిస్తుంది. ఒకటి రెండు కాదు ఏకంగా అన్ని పార్ట్స్ గా ఈ మూవీని తీయనున్నారట. ఇంతకీ ఏం జరుగుతోంది?