ఇటు జూనియర్ ఎన్టీఆర్ RRR విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. అటు దర్శకుడు ప్రశాంత్ నీల్.. కూడా కేజీఎఫ్ క్రియేట్ చేస్తున్న రికార్డులు చూస్తూ కూల్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇలా గ్రాండ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న స్టార్ హీరో, దర్శకుడు సడెన్‌గా ఒక్క చోట చేరారు. అది కూడా కుటుంబంతో కలిసి. ఇంకేముంది.. వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడమే కాక ఇవి చూసిన అభిమానులు.. ఫుల్లు ఖుషీ అవుతున్నారు. మరి ఇంతకు ఈ స్టార్ హీరో-డైరెక్టర్ ఫ్యామిలీ సెలబ్రెషన్స్ ఎందుకో తెలియాలంటే ఇది చదవండి.
ఇది కూడా చదవండి: NTR30: కొరటాల సినిమాలో ఎన్టీఆర్ సరసన సాయిపల్లవి..!
ఎన్టీఆర్-ప్రణతి పెళ్లి రోజు, ప్రశాంత్ నీల్ పెళ్లి రోజు అనుకోకుండా ఒకే రోజు అయ్యాయట. దీంతో సేమ్ పెళ్లి డేట్ అవ్వడంతో వెడ్డింగ్ యానివర్సరీని ఇరు ఫ్యామిలీలు కలిసి సెలెబ్రేట్ చేసుకున్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ ఫ్యామిలీ కలిసి నిన్న రాత్రి ఫుల్ సెలెబ్రేషన్స్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం వీరి సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇవి చూసిన ఇరువురి అభిమానులు తెగ సంతోషపడిపోతున్నారు.
ఇది కూడా చదవండి: Koratala Siva: కొరటాల శివ దెబ్బకి భయపడుతున్న Jr.NTR ఫ్యాన్స్!
టాలీవుడ్ హీరోల తమ తమ దర్శకులను ఫ్యామిలీ మెంబర్లుగా ట్రీట్ చేస్తుంటారు. హీరోలు, దర్శకులు ఎంతగా సింక్ అయితే ప్రాజెక్ట్ అంత బాగా వస్తుందని అందరూ నమ్ముతుంటారు. ఇక తెలుగులో సినిమాలు చేయడానికి, తెలుగు హీరోలతో పని చేయడానికి ముఖ్య కారణం కూడా ఇదేనంటూ ప్రశాంత్ నీల్ గతంలో చెప్పుకొచ్చాడు. అంతేకాక ‘‘తెలుగులో హీరోలు సినిమాల కంటే రిలేషన్లకు ఎక్కువ ఇంపార్టెంట్స్ ఇస్తారు.. అక్కడ ట్రీట్ చేసే విధానం, ఫ్యామిలీలో కలుపుకునే తీరు నాకు నచ్చుతుంది అందుకే అక్కడ సినిమాలు చేస్తున్నాను’’ అంటూ ప్రశాంత్ నీల్ ఆ మధ్య ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. ఈ ఫోటో చూస్తే.. ఇప్పుడు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మధ్య ఎంతటి సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయో అర్థం అవుతోంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ, బుచ్చిబాబు సానా సినిమాలను చేయబోతోన్నాడు. మరో వైపు ప్రభాస్ సలార్ సినిమాతో ప్రశాంత్ నీల్ బిజీగా ఉన్నాడు. వీరి చేతిలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌లు పూర్తయితే అప్పుడు ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కాంబో పట్టాలెక్కనుంది. మరి జూనియర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్‌ల మధ్య ఉన్న బాండింగ్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Ram Gopal Varma : KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ని వీరప్పన్ తో పోలుస్తూ RGV వ్యాఖ్యలు!