హీరోల పిల్లలు సినిమాల్లో ఎంట్రీ ఇవ్వడమనేది సహజమే. ఇప్పటికే అల్లు అర్జున్, మహేష్ బాబు, రవితేజ పిల్లలు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడని వార్తలు వస్తున్నాయి. అది కూడా మహేష్ బాబు కూతురు సితారతో పాటు కలిసి ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. మరి డైరెక్టర్ ఎవరనేది కూడా ప్రచారం చేయకుండా ఉంటారా?
సినిమా ఇండస్ట్రీలో వారసులకు కొదవ లేదు హీరోలు తమ కొడుకులను బాల నటులుగా చేపిస్తూ చిన్నపటి నుంచే ఓనమాలు నేర్పిస్తుంటారు. హీరోల తనయులను కూతుర్లను సినిమాల్లో బాల నటులుగా పరిచయం చేయాలని ఏ హీరో కైనా ఉంటుంది. అలా కొందరు హీరోల కొడుకులు, కూతుళ్లను చిన్నతనంలో తెరమీద తీసుకొస్తారు.. ఇప్పటికే రవితేజ, సుధీర్ బాబు, మహేష్ బాబు, అల్లు అర్జున్ వారి పిల్లలను వివిద సినిమాల్లో నటింపజేశారు. అల్లు అర్జున్ కూతురు ‘అర్హ’ సమంత నటించిన ‘శాకుంతలం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. బుడిబుడి మాటలతో అందరి దృష్టిని ఆకర్శించింది. అదే తరహాలో మహేష్ బాబు కూతురు ‘సితార’ కూడా ‘సర్కారు వారి పాట’లో ప్రమోషన్ సాంగ్‌తో కనిపించి మెప్పించింది.
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు ‘అభయ్ రామ్’ సినిమాల్లోకి బాలనటుడిగా తెరంగేట్రం చేయనున్నాడు. అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురుతో నటించబోతున్నట్లు సమాచారం. ఇదే ఇప్పుడు టాక్ ఆఫ్ ఇండస్ట్రీగా మారింది. ఎన్టీఆర్, మహేష్ ఫ్యాన్స్‌కు పండుగ లాంటి వార్త అయ్యింది. తాజాగా ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అభయ్ కూడా సినిమాల్లో రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మహేష్ కూతురు రీసెంట్గా ఒక యాడ్ చేసి కోటి రెమ్యునరేషన్ తీసుకుందని సమాచారం ఉంది. ఆమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. బాహుబలి సిరీస్ RRRతో సంచలనం సృష్టించిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించబోయే కొత్త సినిమాతో ‘అభయ్ రామ్’ఎంట్రీ ఉండబోతుందని గట్టిగా ప్రచారం జరుగుతుంది.
మహేష్ బాబుతో కలిసి రాజమౌళి ఓ భారీ అడ్వెంచర్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. ఇదే సినిమాలో ఇంట్రడక్షన్ సీన్ దాదాపు 15 నిమిషాల పాటు ఉండనుందని సమాచారం. ఇందులో నటించేందుకు సితార, అభయ్ రామ్‌ను అక్కా,తమ్ముళ్లుగా చూపించేందుకు జక్కన్న భారీగా ప్లాన్ చేస్తున్నరట. ఇప్పుడు ఈ వార్త సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఇదే నిజమైతే తారక్ తనయుడు మొదటి సారి తెరమీద కనపడితే మాత్రం ఫ్యాన్స్‌కి పూనకాలే. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.