దేవర సినిమాలో ఎన్టీఆర్ అత్త పాత్రలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ దేవర. ఈ దేవర సినిమా మీద ఎన్టీఆర్ అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. కొన్ని రోజుల క్రితం ఈ మూవీకి సంబంధించిన ఎన్టీఆర్ లుక్ ని రిలీజ్ చేస్తే.. ఆ లుక్ రికార్డు స్థాయిలో వ్యూస్ ని సొంతం చేసుకుంది. పైగా సినిమా మీద అమాంతం అంచనాలను పెంచేసింది. ఒకప్పటి అందాల నటి శ్రీదేవి కూతురు జాహ్నవి ఎన్టీఆర్ కి జోడిగా నటిస్తున్న ఈ మూవీ గురించి తాజా అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ మూవీ ఎంత పెద్ద హిట్ సాధించిందో చెప్పనక్కర్లేదు.
పైగా తన గత చిత్రం ప్లాప్ అవ్వడంతో కొరటాల శివ దేవర మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్నాడు. సినిమాకి సంబంధించిన ప్రతి విషయంలో ఎంతో జాగ్రత్త పడుతున్నాడు. ఇప్పుడు దేవర సినిమాలోని ఒక ముఖ్యమైన క్యారెక్టర్ కి కొరటాల శివ రమ్యకృష్ణని తీసుకోబోతున్నాడని తెలుస్తుంది. దేవర సినిమాలో ఎన్టీఆర్ కి అత్త క్యారెక్టర్ ఒకటి ఉందని ఆ క్యారెక్టర్ కి రమ్యకృష్ణని తీసుకున్నారని తెలుస్తుంది. గతంలో ఒకసారి ఎన్టీఆర్, రమ్యకృష్ణలు అత్త, అల్లుడుగా నటించారు. ఇప్పుడు ఈ మూవీలో రమ్యకృష్ణ అడుగుపెట్టడం వాళ్ళ మూవీకి చాలా ప్లస్ పాయింట్ అవుతుందని చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నారు.
ఎందుకంటే రమ్యకృష్ణ ఈ మధ్యన తన సెకండ్ ఇన్నింగ్స్ లో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను తన నటనతో అదరగొడుతుంది. సో ఎన్టీఆర్ కి అత్త అంటే హీరోయిన్ క్యారెక్టర్ పోషించే జాన్వీ కపూర్ కి తల్లి పాత్ర అయ్యి వుంటుంది. రమ్యకృష్ణ విషయాన్ని చిత్ర బృందం అధికారంగా ప్రకటించాల్సి ఉంది. ఎన్టీఆర్ అండ్ కొరటాల శివ కెరీర్ లోనే అత్యంత భారీ ప్రతిష్టాత్మక చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యువ సుధ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ ల పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్నారు. అనిరుధ్ మ్యూజిక్ ని అందిస్తుండగా.. రత్నవేలు కెమెరా బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు.