కొరటాలా శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో "దేవర"అనే సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం అల్లు అర్హకి భారీగా రెమ్యునరేషన్ ఇస్తున్నారట.
అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురుగా సోషల్ మీడియాలో ముచ్చట గొలిపే మాటలతో ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం సినిమాలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. అర్హ తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమాలో పిన్స్ భరత పాత్రలో నటించి తన ముద్దు ముద్దు మాటలతో తెలుగులో అనర్గళంగా డైలాగ్ లు చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంత చిన్న వయసులోనే అర్హ నటనలో ప్రతిభ చూపించడంతో ఇప్పుడు ఈ బాలనటికి జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని సమాచారం. అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం అర్హకి భారీగా రెమ్యునరేషన్ ఇస్తున్నారట.
కొరటాలా శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో “దేవర”అనే సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. 2024 ఏప్రిల్ 5 న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుంది. అయితే ఈ సినిమాలో ఒక పాత్ర కోసం అల్లు అర్హను తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో మరికొద్దిరోజుల్లో అల్లు అర్హ కూడా సెట్స్ లో జాయిన్ కాబోతుందని తెలుస్తోంది. పదిరోజుల పాటు షూటింగ్ ఉండనుందని అంటున్నారు. మొత్తం సినిమాలో పది నిమిషాల పాటు నిడివి ఉంటుందని తెలుస్తోంది.
ఈ సందర్భంగా అల్లు అర్హ తీసుకునే రెమ్యూనరేషన్ కూడా హాట్ టాపిక్ గ్గా మారింది. నిమిషానికే మేకర్స్ రూ.2 లక్షలు ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు మొత్తం పది నిమిషాలకు గాను రూ.20 లక్షలు పారితోషికం అందుకోనుందని సమాచారం. దీనిపై చిత్ర బృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. దీంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా అల్లు అర్హ ఇండస్ట్రీలో సెన్సేషన్ గా మారుతోందనే చెప్పాలి. మొత్తానికి ఈ చిత్రానికి అల్లు అర్హ తీసుకోబోతున్న రెమ్యూనరేషన్ మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.